నాందేడ్ సాధువుల హత్య: నిందితుడ్ని పట్టుకున్న తెలంగాణ పోలీసులు
ముంబై: మహారాష్ట్ర నాందేడ్ ఆశ్రమంలో శివాచార్య అనే సాధువుతోపాటు అతని శిశ్యుడు భగవాన్ షిండే అనే మరో వ్యక్తిని హత్య చేసిన హంతకుడిని తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్మల్ జిల్లా తానూరులో హంతకుడు సాయినాథ్ శింఘడేను పట్టుకుని విచారణ తర్వాత మహారాష్ట్ర పోలీసులకు అప్పగించారు.
డబ్బు బంగారం కోసం హత్యలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో హంతకుడు అంగీకరించాడని సమాచారం. కాగా, ఆశ్రమం నుంచి రూ. 70వేల నగదు, ఓ ల్యాప్‌టాప్ ను నిందితుడు దొంగిలించినట్లు తెలిసింది.

శనివారం అర్ధరాత్రి హత్యలు జరగగా.. ఆదివారం తెల్లవారుజామున సాధు శివాచార్య మృతదేహం ఆశ్రమంలోనే లభించింది. ఆయన శిష్యుడి మృతదేహం ఆశ్రమానికి కొద్దిదూరంలో కనిపించింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టమ్ కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ఆరంభించారు.
కాగా, శివాచార్య చాలాకాలం కిందటే నాందెడ్ జిల్లాలోని ఉమ్రి తాలూకాలో ఆశ్రమాన్ని నెలకొల్పారు. తరచూ ఆధ్యాత్మక ప్రసంగాలను ఆయన ఇస్తుంటారు. ఆశ్రమం పేరుతో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. జిల్లాలో ఆయనకు పెద్ద ఎత్తున భక్తులు ఉన్నారు. శివరాత్రి వంటి పండుగల సమయంలో శివాచార్య ఆశ్రమం వందలాదిమంది భక్తులతో సందడిగా మారుతుంది. మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భారీ సంఖ్యలో భక్తులు ఈ ఆశ్రమానికి వస్తుంటారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications