హైటెక్ సిటీ రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్..!!
Hitech Railway Station: ఐటీ హబ్ హైటెక్ సిటీకి కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది. ఇక్కడి రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం, ఆధునికీకరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటివరకు దాదాపుగా 81 శాతం పనులు పూర్తయ్యాయి. వచ్చే ఏడాదిలో ఈ రైల్వే స్టేషన్ అందుబాటులోకి రానుంది. ఈ పనులు పూర్తయితే చర్లపల్లి తరహాలో ఇప్పుడున్న వాటి కంటే అదనపు రైలు సర్వీసులు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
సంక్రాంతి రద్దీ నేపథ్యంలో పలు ఎక్స్ ప్రెస్ రైళ్లకు హైటెక్ సిటీ స్టేషన్ లో హాల్ట్ సౌకర్యం కల్పించింది దక్షిణ మధ్య రైల్వే. జనవరి 7 నుండి 20వ తేదీరకు 14 రోజుల పాటు ఆయా రైళ్లన్నీ కూడా ఇక్కడ ఆగుతాయి.

హైటెక్ సిటీలో ఆగే రైళ్లలో..
12749 మచిలీపట్నం-బీదర్
17255 నర్సాపూర్-లింగంపల్లి
12737 కాకినాడ పోర్ట్- లింగంపల్లి
12806 లింగంపల్లి-విశాఖపట్నం
12775 కాకినాడ టౌన్-లింగంపల్లి (సోమ, బుధ, శుక్ర)
17207 సాయినగర్ షిర్డీ-మచిలీపట్నం (గురు, సోమ, బుధ, శుక్ర)
17205 సాయినగర్ షిర్డీ-కాకినాడ పోర్ట్,
18519 విశాఖపట్నం-లోకమాన్య తిలక్ టెర్మినస్ ముంబై (మంగళవారం) ఉన్నాయి.
హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులూ చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటివరకు 812 శాతం పనులు పూర్తయ్యాయి. స్టేషన్ ఎంట్రీ ర్యాంప్, దివ్యాంగుల సౌకర్యాలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జి లాంచ్, ప్లాట్ ఫామ్ షెడ్స్ పూర్తయ్యాయి. స్టేషన్ భవన సముదాయం, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, సర్కులేటింగ్ ఏరియా నిర్మాణం సాగుతోంది. 12 మీటర్ల వెడల్పుతో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మితమౌతోంది. లిఫ్ట్, ఎస్కలేటర్ సైతం అందుబాటులోకి రానుందీ హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌లో.
కాచిగూడ, సికింద్రాబాద్ తరహాలో ఎస్కలేటర్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకోనుంది. ప్లాట్‌ఫామ్ రీసర్ఫేసింగ్ పనులు కొనసాగుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను విడుదల చేశారు. ఈ స్టేషన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రధాన టెర్మినల్ గా మారే అవకాశాలు లేకపోలేదు. రద్దీ సమయాల్లో కొన్ని రైళ్లను ఇక్కడి నుంచి నడిపించవచ్చు.












Click it and Unblock the Notifications