మల్లారెడ్డి కాలేజీలపై ఉన్నత విద్యామండలికి ఫిర్యాదు- నోటీసులు?

హైదరాబాద్‌ మల్లారెడ్డి విద్యాసంస్థల్లో సినిమా ప్రమోషన్ల నిర్వహణ వ్యవహారం చిలికి చిలికి గాలీవానగా మారుతోంది. నూతన సినిమా విడుదల కోసం విద్యార్థులకు ప్రత్యేకంగా సెలవు సైతం ప్రకటించిన అంశం దుమారం రేపింది. దీన్ని తెలంగాణ ఉన్నత విద్యామండలి తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా విద్యాసంస్థల ప్రాంగణాన్ని సినిమా ప్రమోషన్లకు ఉపయోగించడం, సెలవులు ప్రకటించడంపై మల్లారెడ్డి విద్యాసంస్థల యాజమాన్యానికి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ వివాదానికి ప్రధాన మూలం ఈ నెల 23న నిర్వహించిన ఆదర్శకుటుంబం ఈవెంట్. ఈ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని మల్లారెడ్డి విద్యాసంస్థల ప్రాంగణంలో నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో విద్యాసంస్థల వైస్ ఛైర్‌పర్సన్ ప్రీతిరెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఆదర్శకుటుంబం విడుదల రోజున కళాశాలకు ప్రత్యేక సెలవు ఇవ్వనున్నట్లు వేదికపై ప్రకటించారు. దీనిపై విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నాయకుల నుంచి తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తమైంది.

Holiday Announced for Venkatesh Aadarsha Kutumbam Sparks Complaint Higher Education Council Acts

ఈ వ్యవహారంపై ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్షుడు రజినీకాంత్ నేతృత్వంలో విద్యార్థి సంఘాల ప్రతినిధులు తెలంగాణ ఉన్నత విద్యామండలిని కలిసి ఫిర్యాదు చేశారు. కళాశాలల్లో సినీ ప్రచార కార్యక్రమాలను తక్షణమే నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని, నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్ సంఘాల నాయకులు సైతం నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును పక్కనపెట్టి సినిమా ప్రచారాలకు ప్రాధాన్యం ఇవ్వడం విద్యావ్యవస్థకే చేటు అని పేర్కొన్నారు.

వెంకీ సినిమాకు కాలేజీలకు హాలిడే ఇవ్వడమేంట్రా
వెంకీ సినిమాకు కాలేజీలకు హాలిడే ఇవ్వడమేంట్రా

ఈ నేపథ్యంలో ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్.. మల్లారెడ్డి విద్యాసంస్థలకు నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది. దీనిపై సమగ్ర వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. ప్రభుత్వం ఆమోదించిన అకడమిక్ క్యాలెండర్‌కు భిన్నంగా ప్రైవేటు విద్యాసంస్థలు తమ ఇష్టానుసారంగా సెలవులు ప్రకటించడం చట్టరిత్యా నిబంధనల ఉల్లంఘనే అవుతుందని విద్యామండలి వర్గాలు స్పష్టం చేశాయి.

దీపావళి వేళ.. పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన ప్రధాని మోదీ
దీపావళి వేళ.. పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన ప్రధాని మోదీ

మరోవంక.. క్యాంపస్‌లో ఈవెంట్స్ పెట్టుకుంటే తప్పేముందంటూ ఈ మధ్యే ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రీతిరెడ్డి చెప్పుకొచ్చారు. నిత్యం చదువులతో విద్యార్థులు కూడా బోరింగ్‌గా ఫీల్ అవుతారని, అప్పుడప్పుడు ఇలాంటి ఈవెంట్స్ పెట్టడం వల్ల వారి మైండ్ రిఫ్రెష్ అవుతుందని, తిరిగి ఉత్సాహంతో చదువుకుంటారని అన్నారు. విజయ్ దేవరకొండ కూడా ఓ యూనివర్శిటీని ప్రమోట్ చేస్తున్నారని గుర్తు చేశారు.

తిరుమలలో ట్రయల్ రన్ డెడ్ లైన్: ఉద్యోగులు, విద్యార్థులకు టీటీడీ ఆహ్వానం
తిరుమలలో ట్రయల్ రన్ డెడ్ లైన్: ఉద్యోగులు, విద్యార్థులకు టీటీడీ ఆహ్వానం

యానిమల్, టాక్సిక్ లాంటి అడల్ట్ సినిమాలే ఎక్కువగా తమ క్యాంపస్‌లో ప్రమోషన్స్‌కు వస్తున్నాయనే విమర్శపై ప్రీతిరెడ్డి స్పందించారు. అడల్ట్ సినిమాలు ప్రమోషన్స్ చేస్తే తప్పేముందని, ఇక్కడ విద్యార్థులంతా 16ఏళ్ల పైబడి వయసున్నవారే అని సమర్థించుకున్నారు. తమ క్యాంపస్‌లో సినిమా ఈవెంట్స్ నిర్వహించడం వల్ల 10 రెట్లు ఎక్కువ ప్రమోషన్ జరుగుతుందని చెప్పారు. అదంతా మల్లారెడ్డి బ్రాండ్ అని చెప్పుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+