22న పార్కులకు సెలవు.!ఆధ్యాత్మిక దినంగా యోగా దినోత్సవం.!ఏర్పాట్లలో హెచ్ఎండిఏ.!
హైదరాబాద్: డాక్టర్ బి.అర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎదురుగా తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రారంభోత్సవం సందర్భంగా ఈనెల 22వ తేదీ గురువారం పరిసరాల పార్కులకు సెలవు ప్రకటిస్తున్నట్లు హెచ్ఎండిఏ తెలిపింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తెలంగాణ అమరుల స్మారకాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జూన్ 22న ప్రారంభించనున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో సామాన్య ప్రజానీకానికి, పార్కులకి వచ్చే సందర్శకులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ముందు జాగ్రత చర్యల్లో భాగంగా బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు (బిపిపి) పరిధిలో ఉన్న లుంబినీ పార్క్, ఎన్టీఆర్ ఘాట్, ఎన్టీఆర్ గార్డెన్ లను గురువారం(22వ తేదీన) మూసివేస్తారని హెచ్ఎండిఏ వెల్లడించింది. అంతే కాకుండా ఎన్టీఆర్ ఘాట్ రోడ్డును కూడా మూసివేయనున్నట్టు హెచ్ఎండీఎ అధికారులు వివరించారు.

ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ద ఉత్సవాలలో భాగంగా జూన్ 21 ఆధ్యాత్మిక దినంగా జరుపుకోవాలని, జూన్ 21 ఇంటర్నేషనల్ యోగ డే సందర్భంగా జిహెచ్ ఎం సి, ప్రధాన కార్యాలయం హెచ్ ఓ డి జోనల్ మరియు సర్కిల్ కార్యాలయంలో ఆద్వర్యంలో ఉద్యోగులు యోగ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారని ఒక ప్రకటనలో తెలిపారు.

2023 సంవత్సరానికి గాను "యోగ ఫర్ వసుదైవ కుటుంబకం"నినాదంతో మరియు "హర్ ఆంగన్ యోగ్" దేశీయ ట్యాగ్ లైన్ తో ప్రతి ఇంటిలో యోగా ఆసనాలు చేసేలా చైతన్యం తీసుకురావాలి అన్న అంశంపై యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. యోగా ద్వారా ఆరోగ్య మరియు ఆధ్యాత్మిక లాభాలు చేకూరతాయన్న అవగాహన కలిగించాలని, యోగ డే లోప్రతి ఒక్కరూ పాల్గొనాలని నగర పాలక సంస్థ ఉన్నతాదికారులు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications