బాబాయ్ వరుస అయ్యే వ్యక్తితో ప్రేమ, పెళ్లి: హత్య చేసిన తండ్రి
రంగారెడ్డి: జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో పరువు హత్య జరిగింది. నర్సింహ అనే వ్యక్తి తన కూతురును చంపేశాడు. నాలుగేళ్ల క్రితం ఇంటి పక్కనే ఉంటున్న సురేష్ అనే వ్యక్తిని కూతురు విజయ ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే సురేష్‌ను విజయ బాబాయి అని పిలిచేంది. దూరపు వరుసకు కూడా బాబాయి అవుతాడని తెలుస్తోంది.
ఆ తర్వాత వారిద్దరు ప్రేమించుకొని, పెళ్లి చేసుకున్నారు. సురేష్, విజయలు నాలుగేళ్లుగా వేరే గ్రామం వెళ్లి జీవిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం బంధువు మృతి చెందగా విజయ, సురేష్ గ్రామానికి వచ్చారు. వరుసకు బాబాయి అయ్యే వ్యక్తిని పెళ్లి చేసుకోవడంపై తండ్రి అప్పటి నుంచే ఆగ్రహంతో ఉన్నాడు.

ఈ నేపథ్యంలో ఆమె గ్రామానికి రాగా, ఇలా ఎందుకు చేశావంటూ... గురువారం కత్తితో ఆమె గొంతు కోసి హత్య చేశాడు. బుధవారం రాత్రి నుంచే తండ్రీకూతుళ్ల మధ్య గొడవ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అతను కూతురును హత్య చేసి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
కాగా, విజయ - సురేష్‌లకు రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం ఆరు నెలల గర్భిణి. ఇటీవల సురేశ్ తల్లి మృతి చెందింది. దీంతో వారు గ్రామానికి వచ్చారు. ఇంటి నుంచి వెళ్లిపోయినప్పటి నుంచి కనిపించని కుమార్తె ఒక్కసారిగా కళ్ల ముందు ప్రత్యక్షం కావడంతో నర్సింహ ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications