Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణా కాంగ్రెస్ లో చిగురించిన చేరికల ఆశలు; రేవంత్ రెడ్డి ఫోకస్ అంతా వారిపైనే!!

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో చేరికల ఆశలు చిగురిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆపరేషన్ ఘర్ వాపసీ మొదలు పెడుతుంది. బీఆర్ఎస్, బిజెపిలో ఉన్న అసంతృప్త నేతలను, కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో చేరిన నేతలను తిరిగి కాంగ్రెస్ లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది.

కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో దూకుడు పెంచిన కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బలాన్ని చూపించి, పార్టీ నుంచి వెళ్లిపోయిన నేతలను వెనుకకు ఆహ్వానిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోయిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తో పాటు బీజేపీలో ఇబ్బంది పడుతున్న నేత ఈటల రాజేందర్ ను కూడా పార్టీలోకి ఆహ్వానించారు.

revanthreddy

రేవంత్ రెడ్డి ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్లిపోయిన నేతలను, ఇతర పార్టీలో ఉన్న అసంతృప్తి నేతలను కాంగ్రెస్ పార్టీ బాట పట్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు లను కూడా హస్తం పార్టీలో చేర్చుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే రాహుల గాంధీ వారితో మాట్లాడగా, త్వరలో వారు కాంగ్రెస్ తీర్ధం తీసుకుంటారు అన్నది చర్చనీయాంశంగా మారింది.

తాజాగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు బీజేపీలో చేరడం లేదని సాక్షాత్తు బిజెపి నేత ఈటల రాజేందర్ ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు వచ్చినట్లయింది. కాంగ్రెస్ పార్టీకి మంచి బూస్ట్ ఇచ్చినట్టు అయ్యింది.ఈ ఇద్దరు నేతలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకు రాగలిగితే, ఆపై చేరికలు జోరుగా కొనసాగుతాయని కాంగ్రెస్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

దీంతో ఈ నెలలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడంపై కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఫోకస్ పెట్టింది. ఒకవేళ ఇది గనుక సక్సెస్ అయితే, కాంగ్రెస్ పార్టీలో మరిన్ని చేరికలు కొనసాగుతాయని కాంగ్రెస్ అధినాయకత్వం అంచనా. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఘర్ వాపసీ తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఏ మేరకు సక్సెస్ అవుతుందనేది వేచి చూడాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+