Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్క.. మార్చరీలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఒక అత్యంత అమానవీయ ఘటన నాగరిక సమాజాన్ని తలదించుకునేలా చేసింది. ప్రాణంతో ఉన్నప్పుడు ఆదరణ కరువైనా, కనీసం మరణించాక మృతదేహానికి దక్కాల్సిన గౌరవం కూడా దక్కకపోవడం అక్కడి దుస్థితికి అద్దం పడుతోంది. బ్రతికున్న మనుషులపై కుక్కలు దాడి చేసి.. తీవ్రంగా గాయపరుస్తున్న ఘటనలు మనం రోజూ చూస్తూనే ఉన్నాం. కానీ ఆ కుక్కలు చనిపోయిన మనిషిని కూడా వదలకపోతే..?

జడ్చర్ల మండలం నాగసాల గ్రామానికి చెందిన పోలే భీమేశ్వర్‌(32) వృత్తిరీత్యా లారీ డ్రైవర్. శనివారం ఉదయం బయటకు వెళ్లిన ఆయన, తిరిగి రాలేదు. డ్యూటీకి వెళ్ళాడేమో అని భావించిన కుటుంబ సభ్యులకు సోమవారం ఉదయం ఒక చేదు వార్త వినాల్సి వచ్చింది. స్థానిక చెరువులో భీమేశ్వర్ మృతదేహం తేలియాడుతూ కనిపించింది. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యుల సమక్షంలో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల మార్చురీకి తరలించారు.

Horrific Incident at Jadcherla Govt Hospital Stray Dog Feasts on Dead Body Inside Mortuary

ఘోరం.. మార్చురీలో కుక్కల వీరంగం!

మార్చురీలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో భీమేశ్వర్ మృతదేహాన్ని నేలపైనే ఉంచారు. ఆ గదికి కనీసం తలుపులు సరిగ్గా లేకపోవడంతో ఒక కుక్క లోపలికి చొరబడింది. ఎవరూ లేని సమయంలో ఆ మృతదేహాన్ని కుక్క పీక్కుతింటూ కనిపించిన దృశ్యం చూసిన వారి ఒళ్లు గగుర్పాటుకు లోనయ్యారు. ఈ భయానక దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతోంది.

పేరుకే అప్‌గ్రేడ్.. సౌకర్యాలు శూన్యం!

నిజానికి, 2023లో జడ్చర్లలోని 30 పడకల ఆసుపత్రిని 100 పడకలకు అప్ గ్రేడ్ చేశారు. కానీ, కొత్త భవనంలో మార్చురీకి సంబంధించిన ఫ్రీజర్లు గానీ, ఇతర వసతులు గానీ కల్పించలేదు. దీంతో గత్యంతరం లేక పాత ఆసుపత్రిలోని శిథిలమైన మార్చురీలోనే పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. అక్కడ భద్రత లేక మృతదేహాలను అంబులెన్సుల్లోనే ఉంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదని ఆసుపత్రి వర్గాలే ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

నలుగురు అధికారులపై సస్పెన్షన్ వేటు

ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ప్రభుత్వం వెంటనే స్పందించింది. మంగళవారం రాష్ట్ర వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ అజయ్‌కుమార్‌ జడ్చర్ల ఆసుపత్రిని సందర్శించి విచారణ చేపట్టారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు గాను.. సూపరింటెండెంట్‌ చంద్రకళ, ఆర్‌ఎంవో హరినాథ్‌, డ్యూటీ డాక్టర్‌ మునీషా, ఎంఎన్‌ఓ రవిప్రకాష్ ను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+