అర్ధరాత్రి ఆర్థనాదాలు: అగ్ని ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనం(పిక్చర్స్)

హైదరాబాద్‌ నగరంలోని అత్తాపూర్‌లో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.

హైదరాబాద్‌: నగరంలోని అత్తాపూర్‌లో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఏవీ1 ఎయిర్‌కూలర్‌ దుకాణంలో షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో దుకాణంలోని ఏడుగురు సజీవదహనమయ్యారు.

మంటలను అదుపుచేసిన 6 ఫైరింజన్లు

మంటలను అదుపుచేసిన 6 ఫైరింజన్లు

ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది భారీగా ఎగసిపడుతున్న మంటలను అదుపులోకి తీవ్రంగా ప్రయత్నించారు. దీనికోసం ఆరు అగ్నిమాపక యంత్రాలను వినియోగించారు.

మృతులంతా బీహార్ వాసులు

మృతులంతా బీహార్ వాసులు

మృతులంతా బీహార్‌ వాసులుగా పోలీసులు గుర్తించారు. వీరిలో సద్దాం, అయూబ్‌, ఇర్ఫాన్‌, షారూక్‌లను పోలీసులు గుర్తించారు. రాత్రి ప్రమాదం సంభవించిన వెంటనే యజమానికి కార్మికులు ఫోన్ చేసినప్పటికీ యజమాని స్పందించకపోవడంతో కార్మికులు తమ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.

యజమాని నిర్లక్ష్యం వల్లే..

యజమాని నిర్లక్ష్యం వల్లే..

కార్మికులున్న గోదాంకు బయటి నుంచి యజమాని తాళం వేయడం వల్లే కార్మికులు ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోయారు. ప్రమాద సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన దుకాణ యజమాని ప్రమోద్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఎక్స్ గ్రేషియా

ఎక్స్ గ్రేషియా

జీహెచ్ఎంసీ కమిషనర్.. మృతులకు ఒక్కొక్కరి కుటుంబాలకు రూ. 5లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మృతదేహాలను స్వస్థలాలకు చేర్చేందుకు రూ.25వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+