శాసనసభలో ఆ బిల్లుపై రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఒకేమాట
తెలంగాణా రాష్ట్ర శాసనసభా సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసన సభ 2025 తెలంగాణా మానవ అవయవాల మార్పిడి బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. అవయవ మార్పిడి విషయంలో కొత్త చట్టాన్ని అమలుచేయటానికి ప్రభుత్వం నిబద్ధతతో కట్టుబడి ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ స్పష్టం చేశారు.
శాసనసభలో మానవ అవయవాల మార్పిడి బిల్లు
అంతకు ముందు, అవయవ దానానికి సంబంధించి గతంలో ఉన్న విధానాన్ని సవరిస్తూ, 2025 తెలంగాణా మానవ అవయవాల మార్పిడి బిల్లును శాసనసభ చర్చకు చేపట్టింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శాసన సభలో ప్రవేశ పెట్టిన బిల్లును అధికార కాంగ్రెసు, ప్రధాన ప్రతిపక్షం BRS బిల్లును సమర్ధించాయి. బిల్లును ప్రవేశపెడుతూ, కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని రాష్ట్రంలో అమలుచేసేందుకు ప్రతిపాదిస్తునట్లు చెప్పారు.

అవయవాల మార్పిడి బిల్లుకు బీఆర్ఎస్ ఆమోదం
చట్టంలో వచ్చిన మార్పులను తెలంగాణా రాష్ట్రం కూడా అమలుచేసి, అవయవదానాన్ని ప్రోత్సహించేందుకు ఈ బిల్లును ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు. బ్రెయిన్ డెడ్ ను ప్రకటించేందుకు మరింతమంది నిపుణులైన వైద్యులకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ బిల్లుపై BRS సభ్యులు హరీష్ రావు మాట్లాడుతూ, బిల్లును సమర్ధిస్తున్నట్లు చెప్పారు. అలాగే, అవయవదానం చేసినా సందర్భంలో వారికి ప్రభుత్వం తరఫున అధికారికంగా అంత్యక్రియలు చేయాలనీ, వారి కుటుంబానికి ప్రభుత్వ పథకాల లబ్ది చేకూర్చాలనీ సూచించారు.
శాసన సభ్యులంతా అవయవ దానం చెయ్యాలన్న కేటీఆర్
అవయవాల కోసం ఎదురుచూస్తున్న వారి జాబితా సుదీర్ఘంగా ఉందనీ, ఇప్పటికే రాష్ట్రంలో అవయవ దానం పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా జరుగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. శాసన సభ్యులంతా అవయవ దానం చేసి తమ నియోజక వర్గాల ప్రజలకు ఆదర్శంగా ఉండాలని, అందుకు వీలుగా తమ అవయవాలను దానం చేస్తామని ప్రతిజ్ణ తీసుకోవాలని BRS సభ్యులు K తారక రామారావు సూచించారు.
అవయవదాన శిబిరాన్ని ఏర్పాటు చెయ్యాలన్న కేటీఆర్
ఇందుకు అవసరమైన ఒక అవయవదాన శిబిరాన్ని ఏర్పాటు చేయాలని శాసన సభ స్పీకరు గడ్డం ప్రసాద కుమార్ కు సూచించారు. ఈ విషయమై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని కోరారు. మనమంతా ప్రజా ప్రతినిధులమని, ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications