విమానంలో మల్లారెడ్డి కోడలు చేసిన పనికి అందరూ ఫిదా!
బీఆర్ఎస్ నాయకుడు మాజీ మంత్రి మల్లారెడ్డి.. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాలమ్మినా, పూలమ్మినా అంటూ తాను స్వయంకృషితో ఎదిగానని తన గురించి చెప్పుకునే మల్లారెడ్డి రూటే సపరేటు. ఇక మల్లారెడ్డి మాత్రమే కాదు మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతి రెడ్డి కూడా అంతే స్పెషల్. కాలేజీలో పిల్లలతో కలిసి స్టెప్పులేసినా, సేవ చేసిన ఆమెది ఒక విభిన్నమైన శైలి.
మల్లారెడ్డి కోడలు మానవత్వం
తాజాగా ఢిల్లీ నుండి హైదరాబాద్ వస్తున్న విమానంలో ఆమె చూపించిన మానవత్వం ఇప్పుడు ప్రతి ఒక్కరి మన్ననలను పొందుతుంది. ఇంతకీ మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతి రెడ్డి ఏం చేశారంటే.. ఢిల్లీ నుండి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న 74 ఏళ్ల వృద్ధుడు ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఒక్కసారిగా అతని మూర్ఛకు గురికావడంతో, అతని నోటి నుండి నురగలు రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.

విమానంలో ప్రీతిరెడ్డి చేసిన పనితో ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు
అదే విమానంలో ప్రయాణం చేస్తున్న మల్లారెడ్డి కోడలు ప్రముఖ వైద్యురాలు డాక్టర్ ప్రీతి రెడ్డి వృద్ధుని వద్దకు చేరుకొని అతని పల్స్ చెక్ చేశారు. బీపీ బాగా తగ్గిపోయిందని గుర్తించిన ఆమె ఏమాత్రం ఆలస్యం చేయకుండా సిపిఆర్ చేశారు. డాక్టర్ ప్రీతి రెడ్డి తక్షణం స్పందించి చేసిన పనితో వృద్ధుడు కోలుకున్నాడు. ప్రాథమికంగా ప్రమాదం తప్పడంతో విమానంలో ఉన్న వారంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.
ప్రీతిరెడ్డి మానవత్వాన్ని ప్రశంసించిన ప్రయాణికులు
ఇక హైదరాబాదులో విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయిన తర్వాత ఎయిర్పోర్ట్ సిబ్బంది వృద్ధుడిని మరింత మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. విమానంలో సరైన సమయానికి స్పందించి, వృద్ధుడి ప్రాణాలను కాపాడిన డాక్టర్ ప్రీతి రెడ్డి పట్ల పట్ల విమానంలో ప్రయాణం చేసిన మిగిలిన వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆమె మానవతా హృదయాన్ని పలువురు ప్రశంసించారు.
మల్లారెడ్డి కోడలు మానవత్వానికి అద్దం పట్టిన ఘటన
విమాన సిబ్బంది కూడా ఆమె చూపిన చొరవను ప్రశంసించి కృతజ్ఞతలు తెలియజేశారు. అత్యవసర పరిస్థితుల్లో మల్లారెడ్డి కోడలు చేసిన పని ఒక వృద్ధుడి ప్రాణాలను కాపాడడం మాత్రమే కాకుండా, ఆమెలోని మానవత్వానికి అద్దం పట్టింది.












Click it and Unblock the Notifications