హుజూరాబాద్ బీజేపీదే: 21వేల ఓట్లకు పైగా మెజార్టీతో గెలిచిన ఈటల రాజేందర్
అక్టోబర్ 30న దేశవ్యాప్తంగా మూడు పార్లమెంట్ స్థానాలకు 29 అసెంబ్లీ స్థానాలకు వివిధ కారణాలతో ఉపఎన్నికలు జరిగాయి. కొన్ని రాష్ట్రాల్లో ఈ ఉపఎన్నికలను ప్రత్యర్థి పార్టీలు ఆయా ప్రభుత్వాలకు రిఫరెండంగా భావిస్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఏపీలో బద్వేలు నియోజకవర్గం, తెలంగాణలో హుజూరాబాద్ నియోజక వర్గాలకు ఉపఎన్నిక జరిగింది. అయితే అందరి దృష్టి హుజూరాబాద్ ఉపఎన్నిక పైనే పడింది. మాజీ మంత్రి ఈటల రాజీనామాతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది.

హుజూరాబాద్‌లో మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి అనుకూలంగా ఫలితాన్ని ఇచ్చాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తలకిందులు చేసేలా టీఆర్ఎస్ హుజూరాబాద్‌లో జెండా ఎగురవేస్తుందని గులాబీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక బద్వేలులో వార్ వన్‌సైడ్ జరిగిందనే వార్తలు వచ్చాయి. ఆ వార్తలే నిజమయ్యాయి. బద్వేలులో వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధా బీజేపీ అభ్యర్థి పంతాల సురేష్ పై 90,590 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఇక హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. మరి కొంత సమయంలో హుజూరాబాద్ ఫలితం కూడా వెలువడనుంది. తెలుగు రాష్ట్రాల ఉపఎన్నిక ఫలితాలతో పాటు దేశవ్యాప్తంగా జరిగిన ఉపఎన్నిక ఫలితాలు మినిట్ - టూ - మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం.
The People have made their choice by ensuring victory for our candidates Sh. Abdus Saleh in Rajabala constituency & Sh. Pyniaid Sing Syiem in Mawryngkneng constituency. This is a victory of our people.
— Conrad Sangma (@SangmaConrad) November 2, 2021
My gratitude to all those who contributed in this big win! Long live NPP! pic.twitter.com/kmcbRfGXQW
By-election to Assembly constituencies across 14 states | YSRCP leading on the lone seat in Andhra Pradesh, BJP leading on 3 & UPPL on 2 in Assam, JD(U) & RJD on one each in Bihar and INLD leading on the single-seat in Haryana. pic.twitter.com/05AZkshsKa
— ANI (@ANI) November 2, 2021












Click it and Unblock the Notifications