Huzurabad Bypoll Results: తొలి రౌండ్ లో బీజేపీకి ఆధిక్యత- 166 లీడ్ లో ఈటల: చివరి వరకూ ఉత్కంఠే..!!

ప్రతిష్ఠాత్మకంగా మారిన హుజూరాబాద్ ఉప ఎన్నికల తొలి రౌండ్ కౌంటింగ్ లో తొలి రౌండ్ ఫలితాలు వెల్లడయ్యాయి. తొలి రైండ్ లో హుజూరాబాద్ మండల కేంద్రానికి సంబంధించిన ఓట్లు లెక్కించారు. ఇందులో బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ అభ్యర్ధి పైన 166 ఓట్ల ఆధిక్యత సాధించారు. ఈ రౌండ్ లో బీజేపీకి 4,610 టీఆర్ఎస్ కు 4444, కాంగ్రెస్ 119 ఓట్లు దక్కించుకున్నాయి. దీని ద్వారా ముందు నుంచి అంచనా వేస్తున్నట్లుగానే క్లోజ్ ఫైట్ కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తోంది. చివరి రౌండ్ వరకు నువ్వా నేనా అన్నట్లుగా పోటీ సాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

పోస్టల్ బ్యాలెట్ లో టీఆర్ఎస్ ఆధిక్యత

పోస్టల్ బ్యాలెట్ లో టీఆర్ఎస్ ఆధిక్యత

హుజూరాబాద్ పోస్టల్ బ్యాలెట్ లో మొత్తం 723 ఓట్లు పోలయ్యాయి. అందులో టీఆర్ఎస్ కు 503 రాగా, బీజేపీకి 159 పోలయ్యాయి. కాంగ్రెస్ కు 32 ఓట్లు వచ్చాయి. ఇక, 14 ఓట్లు చెల్లనివిగా అధికారులు తేల్చారు. ఈ ఉప ఎన్నికకు సంబంధించి మొత్తం 22 రౌండ్ల‌లో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ముగియ‌నుంది. ఒక్కో రౌండ్‌కు 30 నిమిషాల స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంది. తొలుత హుజూరాబాద్ మండ‌లంలోని గ్రామాల ఓట్ల‌ను లెక్కించారు.

రౌండ్ రౌండ్ కు టెన్షన్ తప్పదా

రౌండ్ రౌండ్ కు టెన్షన్ తప్పదా


ఆ త‌ర్వాత వీణ‌వంక‌, జ‌మ్మికుంట‌, ఇల్లంద‌కుంట‌, క‌మ‌లాపూర్ మండ‌లాల‌ ఓట్ల లెక్కింపు జ‌ర‌గ‌నుంది. మొద‌ట పోతిరెడ్డిపేట‌, ఆఖ‌రున శంభునిప‌ల్లి ఓట్ల‌ను లెక్కించ‌నున్నారు. సాయంత్రం 4 గంట‌ల‌కు తుది ఫ‌లితం వ‌చ్చే అవ‌కాశం ఉంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో 30 మంది అభ్య‌ర్థులు పోటీలో నిలిచారు. టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాద‌వ్, కాంగ్రెస్ నుంచి బ‌ల్మూరి వెంక‌ట్, బీజేపీ నుంచి ఈట‌ల రాజేంద‌ర్ పోటీలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వ‌ద్ద మూడంచెల భ‌ద్ర‌త ఏర్పాటు చేశారు. 144 సెక్ష‌న్ అమ‌లు చేస్తున్నారు. విజ‌యోత్స‌వ ర్యాలీల‌కు పోలీసులు అనుమ‌తి ఇవ్వ‌లేదు.

భారీ పోలింగ్ తో లోలోపల అంతర్మధనం

భారీ పోలింగ్ తో లోలోపల అంతర్మధనం


హుజూరాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలో శనివారం జరిగిన పోలింగ్‌లో ఓటర్లు భారీగా తరలివచ్చి ఓట్లేశారు. దాంతో రికార్డు స్థాయిలో 86.64 శాతం పోలింగ్‌ నమోదైంది. మొత్తం ఓట్లు 2,36,873 కాగా, ఓటు హ‌క్కు వినియోగించుకున్న వారి సంఖ్య 2,05,236. కాగా 1,02,523(87.05 శాతం) మంది పురుషులు, 1,02,712(86.25 శాతం) మంది మ‌హిళ‌లు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. ఇక, పోస్టల్ బ్యాలెట్ లో ఆధిక్యత సాధించిన టీఆర్ఎస్ పార్టీ తుది ఫలితం వరకు తమ ఆధిక్యత కొనసాగుతుందనే అంచనా వేస్తోంది.

Recommended Video

    Shahrukh Khan కి టఫ్ టైమ్.. ఉచ్చులో Ananya Pandey | King Khan ఆవేదన || Oneindia Telugu
    ఎగ్జిట్ పోల్స్ తో బీజేపీలో పెరిగిన ధీమా

    ఎగ్జిట్ పోల్స్ తో బీజేపీలో పెరిగిన ధీమా


    అదే సమయంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో బీజేపీ నేతల్లో ధీమా కనిపిస్తోంది. హోరా హోరీగా పోరు సాగినా .. తుది ఫలితం తమకే అనుకూలమని బీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే, పోలింగ్ నాడు చివరి రెండు గంటల్లో సాగిన 16 శాతం పోలింగ్ ఇప్పుడు రెండు ప్రధాన పార్టీలను కలవరానికి గురి చేస్తోంది. దీంతో.. పైకి ధీమాగా కనిపిస్తున్నా..కౌంటింగ్ సెంటర్ల వద్ద మాత్రం రెండు పార్టీల నేతలు టెన్షన్ గానే ఉన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+