వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దమ్ముంటే సస్పెండ్ చేయండి - వాళ్లు టీఆర్ఎస్ కు సహకరిస్తున్నారు : ఢిల్లీలో టీపీసీసీ నేతల వార్..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఒకరి పైన మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. హుజూరాబాద్ బై పోల్ ఫలితం పైన ఏఐసీసీ నేత వేణు గోపాల్ పోస్టు మార్టం నిర్వహించారు. అక్కడ కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరు మార లేదు. సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత.. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సమన్వయ లోపమే హుజురాబాద్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఓటమికి కారణమని ఆయన తేల్చి చెప్పారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోదరుడు (కజిన్‌) కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ ఇప్పించుకున్నారంటూ పొన్నం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తుడిచిపెట్టుకుపోవడం ఖాయమంటూ

తుడిచిపెట్టుకుపోవడం ఖాయమంటూ

ఇలాగే కొనసాగితే, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొందరు నాయకులు అడ్డుతగలడంతో దమ్ముంటే పార్టీ నుంచి తనను సస్పెండ్‌చేయాలంటూ పొన్నం సవాల్‌ విసిరారు. ఉపఎన్నిక ఇన్‌చార్జ్‌గా తనను బాధ్యుడిని చేసే విమర్శలు అర్థరహితం అంటూ పొన్నం ప్రభాకర్‌ మండిపడ్డారు. హుజురాబాద్ మీదే కాకుండా నాగార్జునసాగర్, హుజూర్ నగర్, దుబ్బాక ఓటమి పై కూడా సమీక్షలు నిర్వ హించాలని పొన్నం ప్రభాకర్‌ డిమాండ్ చేశారు.. కాంగ్రెస్ పార్టీలో ఉండి కొందరు టీఆర్ఎస్ పార్టీకి సహకరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

నేతల మాటల యదం..

నేతల మాటల యదం..

గతంలో పనిచేసిన ఇద్దరు పీసీసీ అధ్యక్షులు కే కేశవరావు, డీ శ్రీనివాస్‌లు రాజ్యసభ సభ్యులయ్యేందుకు కాంగ్రెస్‌ పార్టీని మోసం చేశారంటూ వ్యాఖ్యానించారు. ఒకరి పైన మరొకరి ఆరోపణలు తీవ్ర స్థాయికి చేరటంతో ముఖ్య నేతలు పార్టీ సమావేశం అర్దాంతరంగా ముగించారు. మరోసారి సాయంత్రం సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి జగ్గారెడ్డిని ఆహ్వానించలేదు. ఆయన ఓపెన్ గా ఏం మాట్లాడినా మరింత సమస్యలు వస్తాయనే కారణంతోనే ఆయన్ను దూరంగా ఉంచినట్లు చెబుతున్నారు.

వివాదంతో అర్దాంతంగా సమావేశం వాయిదా

వివాదంతో అర్దాంతంగా సమావేశం వాయిదా

కాంగ్రెస్ పార్టీ వార్ రూంలో హుజూరాబాద్ పై చేసిన సమీక్షలో టీపీసీసీ నేతల వార్ పై హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సమావేశం నుంచి బయటకు వచ్చిన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణికం ఠాకూర్ కీలక వ్యాఖ్యలు చేసారు. సమన్యయ లోపం ఎక్కడ జరిగిందో తెలుసుకుంటున్నామని చెప్పారు. ఎఖ్కడ తప్పు జరిగిందో తెలుసుకొని ..సరిదిద్దుకొనే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ బీజేపీ బీ టీంగా తయారైందని పేర్కొన్నారు. గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ అన్నట్లుగా ఆ రెండు పార్టీల వ్యవహారం సాగుతోందని విమర్శించారు.

బీజేపీ కి బీ టీం టీఆర్ఎస్

బీజేపీ కి బీ టీం టీఆర్ఎస్


ధాన్యం కొనుగోలు పైనా డ్రామాలు ఆడతున్నారని విమర్శించారు. మీటింగ్ లో భిన్నాభిప్రాయాలు వచ్చినా..పార్టీ పరిస్థితి పైన వాస్తవాలు తెలుసుకొనేందుకే ఈ సమావేశం అని స్పష్టం చేసారు. అసలు హుజూరాబాద్ లో కాంగ్రెస్ సాంప్రదాయ ఓట్ బ్యాంకు ఏమందంటూ సీనియర్ నేత వీహెచ్ ప్రశ్నించారు. తెలంగాణ కంటే ఏపీలో పార్టీ లేకపపోయినా కాంగ్రెస్ కు ఆరు వేల ఓట్లు వచ్చిన విషయాన్ని గుర్తు చేసారు. సాయంత్రానికి టీపీసీసీ నివేదిక ఇవ్వనుంది. అందులో హుజూరాబాద్ లో పార్టీ కి తక్కువ ఓట్లు రావటానికి కారణాలు.. ప్రచారం..నేతల మధ్య సమన్వయం వంటి అంశాల పైన పూర్తి వివరాలు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. ఇక, ఈ సమావేశం తరువాత ఏఐసీసీ ఏ రకంగా స్పందిస్తుందనేది వేచి చూడాలి.

English summary
Telangana Congress leaders have discussed the future course of action in Delhi in war room.Ponnam Prabhakar had challenged the state leaders to suspend him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X