తల్లి ప్రియుడి ఘాతుకం: చిన్నారికి చిత్రహంసలు
ఐదేళ్ల చిన్నారిపై ఆమె మారుతండ్రి చిత్రహింసలకు గురిచేశాడు. ఆమె పాఠశాలకు వెళ్లడం లేదని, అసభ్యపదజాలం మాట్లాడుతోందంటూ చితకబాదాడు. దీంతో ఆ బాలికపై వీపుపై వాతలు వచ్చాయి.
హైదరాబాద్: ఐదేళ్ల చిన్నారిపై ఆమె మారుతండ్రి చిత్రహింసలకు గురిచేశాడు. ఆమె పాఠశాలకు వెళ్లడం లేదని, అసభ్యపదజాలం మాట్లాడుతోందంటూ చితకబాదాడు. దీంతో ఆ బాలికపై వీపుపై వాతలు వచ్చాయి. కాగా, ఈ విషయం చైల్డ్ లైన్ వారికి తెలియడంతో వారు తుకారాంగేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా, కొత్తగడి గ్రామానికి చెందిన అనసూర్య, వెంకటయ్య దంపతులు. వీరికి శివాత్మక(7), రాఘవి(5) ఇద్దరు ఆడ పిల్లలు. నాలుగేళ్ల క్రితం వెంకటయ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో అనుసూర్య సమీపంలోని పిరంపల్లి గ్రామానికి చెందిన దూరపు బంధువు ప్రవీణ్‌కుమార్‌తో సహజీవనం చేస్తోంది.

పిల్లలతో కలిసి వీరిద్దరూ నాలుగు నెలల క్రితం అడ్డగుట్టకు వలస వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నారు. ప్రవీణ్‌కుమార్ సెంట్రింగ్ పని చేస్తుండగా అనసూర్య ఇంట్లోనే గృహిణిగా ఉంటోంది. రెండో కూతురు రాఘవి తుకారాంగేట్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతోంది. కాగా, ఆమె అసభ్య పదజాలం మాట్లాడుతుందని, పాఠశాలకు రావడం లేదని ఉపాధ్యాయురాలు ఫిర్యాదు చేయడంతో ప్రవీణ్ కుమార్ అక్టోబర్ 1న రాత్రి బెత్తంతో రాఘవిని తీవ్రంగా కొట్టడంతో వీపుపై వాతలు వచ్చాయి.
ఈ మేరకు చైల్డ్ లైన్ ప్రతినిధి అశ్వినికి సమాచారం అందడంతో ఆమె శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకొని పాపను చైల్డ్ లైన్ వారికి అప్పగించి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. కాగా, తల్లి అనసూర్య రాఘవి చేతి గోర్లు నెయిల్ కట్టర్‌తో తీయడంతో ఓ వేలి గోరు చిగురు వరకు కట్టైందని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications