ఆఫ్రికా స్త్రీ హత్య: కూతురు భవిష్యత్తుపై సస్పెన్స్, రూపేష్ కస్టడీకి పిటిషన్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: భర్త చేతిలో హత్యకు గురైన సింథియా కుమార్తె సానియాను ఎవరికి అప్పగించాలనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. కాంగో దేశం నుంచి వచ్చిన రాయబారి, న్యాయవాదులు చిన్నారిని తమకు అప్పగించాలని కోర్టుకు విన్నవించారు.

Also Read: ఆఫ్రికా స్త్రీ హత్య, ట్విస్ట్: మేమేంటో చూపిస్తామని పీఎస్‌లో బంధువుల హైడ్రామా

సానియా తండ్రి తరఫు బంధువులు కూడా చిన్నారిని తమకే అప్పగించాలంటున్నారు. ఇరువురి వాదనలు విన్న రాజేంద్రననగర్‌ ఉప్పర్‌పల్లి కోర్టు న్యాయమూర్తి... ముందు ఫ్యామిలీ కోర్టులో తేల్చుకోవాలని సూచించారు. చిన్నారిని ఎల్బీ నగర్‌ ప్యామిలీ కోర్టులో హాజరుపర్చి, ఆ ఆదేశాల మేరకు నడుచుకోవాలన్నారు.

Also Read: ఆఫ్రికా స్త్రీ హత్య: పాపపై డైలమా, సింథియా బ్రదర్ గందరగోళం (పిక్చర్స్)

Hyderabad 7 Year Old Knows Her Dad Killed Her Mother

దీంతో పోలీసులు సానియాను శిశుసంరక్షణ కేంద్రం నుంచి ఎల్బీనగర్‌ ఫ్యామిలీ కోర్టుకు తరలించారు. భార్యను హత్యచేసిన రూపేష్ కుమార్‌ను మూడు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ మాదాపూర్‌ సీసీఎస్‌ పోలీసులు ఉప్పర్ పల్లి కోర్టులో పిటిషన్‌ వేశారు. కాగా, తల్లి హత్య అనంతరం సానియా నాయనమ్మ లీలావతి వద్ద ఉండగా, ఇప్పుడు రెస్క్యూ హోంకు తరలించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Hyderabad 7 Year Old Knows Her Dad Killed Her Mother.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X