13 ఏళ్ళ బాలికపై 76 ఏళ్ళ వ్యక్తి అత్యాచారం, అరెస్ట్
హైదరాబాద్: పదమూడేళ్ల బాలికపై ఓవృద్ధుడు అత్యాచారం చేసిన సంఘటన హైద్రాబాద్‌లోని హబీబ్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం ఆగాపురాలో అబ్దుల్ వహబ్ (76) అనే వృద్ధుడు నివాసముంటున్నాడు.
సౌదీ అరేబియా నుంచి వచ్చిన అబ్దుల్ వహబ్ ఇక్కడ స్థిరపడ్డాడు. అతనికి ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. వీరంతా సౌదీ అరేబియాలోనే ఉంటున్నారు. వహబ్ మాత్రం కోడలితో పాటుగా ఆగాపురాలో ఉంటున్నాడు.

బుధవారం కోడలు ఇంట్లో లేని సమయంలో అతను బస్తీకి చెందిన 13 ఏళ్ల అమ్మాయికి చాక్లెట్ ఇస్తానంటూ నమ్మించి ఇంట్లోకి పిలిచి అత్యాచారం చేశాడు. అయితే బాలిక శరీరంలో వచ్చిన మార్పులను గమనించిన తల్లిదండ్రులు బాధితురాలిని ఆసుపత్రికి తరలించగా ఆమె గర్భం దాల్చిందని వైద్యులు తేల్చి చెప్పారు.
దీంతో బాధితురాలిని తల్లిదండ్రులు నిలదీస్తే అసలు విషయం చెప్పింది. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంతే కాదు నిందితుడిని అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications