మాదాపూర్ హోటల్‌లో దారుణం: ప్రియురాలి గొంతుకోసి, ప్రియుడు ఆత్మహత్య

హైదరాబాద్: నగరంలోని మాదాపూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మాదాపూర్‌లోని లెమన్ ట్రీ హోటల్‌లో యువతిని హత్య చేసిన ఓ యువకుడు, ఆ తర్వాత అతడు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిద్దరూ ప్రేమజంటగా తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ప్రియురాలిని బ్లేడుతో గొంతుకోసి బాత్రూంలో పడేసిన యువకుడు.. ఆ తర్వాత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆధారాలను సేకరించారు.

 Hyderabad: A youth commits suicide after killing of his girlfriend in madhapur hotel.

మృతులు మహబూబ్‌నగర్‌కు చెందిన సంతోషి, రాములుగా గుర్తించారు. బుధవారం మధ్యాహ్నం లెమన్ ట్రీ హోటల్‌లో రాములు గది తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మాదాపూర్ పోలీసులు చెప్పారు.

అనుమానంతో భార్య దారుణ హత్య

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని అశోక్‌నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భార్యను గొంతుకోసి హత్య చేశాడు భర్త. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అశోక్‌నగర్‌కు చెందిన ఆసిఫ్ లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. 18 ఏళ్ల క్రితం అతనికి సాహినీతో వివాహం జరిగింది. భార్య మరొకరితో సంబంధం కొనసాగిస్తుందనే అనుమానంతో నెల రోజులుగా ఇంటివద్దే ఉంటున్న ఆసిఫ్ ఆమె హత్యకు కుట్ర పన్నాడు.

గురువారం మధ్యాహ్నం తన కుమారుడు సాహెల్‌ను ఏదో పనిచెప్పి బయటికి పంపించాడు. అదే సమయంలో ఇంట్లోనే ఉన్నకూతురు బాత్రూంలో స్నానం చేస్తోంది. ఇదే అదనుగా భావించిన ఆసిఫ్.. టీవీ సౌండ్ పెంచి.. కత్తితో భార్య గొంతుకోసి హతమార్చాడు. హత్య చేసిన అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+