ఈ జలపాతాలను అస్సలు మిస్ కావొద్దు.. హైదరాబాద్ కు దగ్గరలోనే..!

ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. మరికొద్దిరోజుల్లో వర్షాలు ఉద్ధృతం కానున్నాయి. దాంతో రాష్ట్రంలోని వాగులు, వంకలు, కాలువలు పొంగిపొర్లనున్నాయి. వర్షాలు, వరదల కారణంగా నదుల్లోకి కొత్త నీరు వచ్చి చేరుతుంది. అయితే ఈ సీజన్ లో జలపాతాలు చాలా అందంగా ఉప్పొంగే నీటితో ప్రకృతి రమణీయంగా ఉంటాయి. ముఖ్యంగా నగరవాసులు జలపాతాలను చూసేందుకు దూర ప్రాంతాలకు వెళ్తుంటారు. అయితే హైదరాబాద్ కు దగ్గరలోనే అందమైన.. ప్రకృతి రమణీయమైన జలపాతాలు ఉన్నాయి. వాటిని మీరు ఎప్పుడైనా చూశారా..? ఆ జలపాతాల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..

హైదరాబాద్ వాసులకు కాస్త రిలీఫ్ దొరికినా పర్యాటక ప్రాంతాలకు వెళ్తుంటారు. అయితే హైదరాబాద్ కు దగ్గరలో ఈ జలపాతాల వివరాలు గురించి మీకు తెలుసా..? భాగ్యనగరానికి దగ్గరలో నాగార్జునసాగర్ ఎత్తిపోతల ఉంది. ఇక్కడ నీళ్లు దాదాపు 70 అడుగుల ఎత్తు నుంచి కిందకు దుంకుతుంటాయి. చూసేందుకు ఈ ప్రాంతం చాలా అద్భుతంగా ఉంటుంది. హైదరాబాద్ కు కేవలం 150 నుంచి 160 కి.మీ. దూరంలోనే ఈ జలపాతం ఉన్న నేపథ్యంలో నగరవాసులు వీకెండ్ లో ఎక్కువగా ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు. ఇక్కడ మొత్తం 26 క్రస్ట్ గేట్స్ ఉండగా వాటిని విడుదల చేసినప్పుడు ఆ అందమైన వ్యూ చాలా బాగుంటుంది.

ఇక తెలంగాణ రాష్ట్రంలోనే ఎత్తయిన, అందమైన జలపాతంగా కుంతాల జలపాతానికి పేరుంది. ఈ జలపాతం దట్టమైన సహ్యాద్రి- నల్లమల అడవులు కొండల మధ్య నుంచి ప్రవహిస్తుంది. ప్రకృతి ప్రేమికులకు, పర్యాటకులకు ఇది అద్భుతమైన పిక్నిక్ స్పాట్ గా ఉంది. ఈ జలపాతం నిర్మల్ జిల్లా పరిధిలోని నేరడిగొండ మండలంలో ఉంది. గోదావరి నదికి ఉపనది అయిన కడెం నదిపై ఈ జలపాతం ఉంది. కుంతాల జలపాతం సుమారు 45 మీటర్ల ఎత్తు నుంచి రెండు అంచెలుగా కిందకు పడుతుంది.

Hyderabad Best Waterfall Getaways Nagarjuna Sagar Bogatha Kuntala amp amp Pochera Falls waterfalls Hyd

అలాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బొగత జలపాతం ఉంది. ఈ ప్రాంతాన్ని తెలంగాణ నయాగరా అని పిలుస్తుంటారు. ఈ జలపాతం దట్టమైన అడవులు, కొండల మధ్య ఉంటుంది. హైదరాబాద్ నుంచి సుమారు 170 కి. మీ. దూరంలో ఈ జలపాతం ఉంది. ఈ జలపాతం చుట్టూ ఏటూరునాగారం వైల్డ్ లైఫ్ శాంక్చురీ విస్తరించి ఉంది. బొగత జలపాతం సుమారు 30 అడుగుల ఎత్తు నుంచి కిందకు జాలువారుతుంది. ఇక మల్లెలతీర్థం జలపాతం కూడా చాలా ఫేమస్.. ఈ వాటర్ ఫాల్స్ దట్టమైన నల్లమల అడవుల మధ్య ఉంది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం మార్గంలో దాదాపు 180 కి.మీ. దూరంలో ఈ జలపాతం నెలకొని ఉంది. వీటితోపాటు హైదరాబాద్ కు సమీపంలోనే భీమునిపాదం, పొచ్చర్ల, గాయత్రి జలపాతాలు పర్యటకుల్ని కనువిందు చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+