హైటెక్ వ్యభిచారం: సిద్ధార్థ్ గుట్టు చెప్పింది అతని ప్రేయసే
స్పా, మసాజ్ సెంటర్లలో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న సమాచారాన్ని పోలీసులకు అందించింది ఓ మహిళ అని తెలుస్తోంది. ఆమె సిద్దార్థ్ మాజీ ప్రేయసి అని చెబుతున్నారు.
హైదరాబాద్: స్పా, మసాజ్ సెంటర్లలో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న సమాచారాన్ని పోలీసులకు అందించింది ఓ మహిళ అని తెలుస్తోంది. ఆమె సిద్దార్థ్ మాజీ ప్రేయసి అని చెబుతున్నారు. దాసరి సిద్దార్థ్ ఆమెను ప్రేమించి, తర్వాత మోసం చేశాడని చెబుతున్నారు.
ఆమె పోలీసుల వద్దకు వెళ్లి సెక్స్ దందా గురించి చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. సైబరాబాద్ పరిధిలో పోలీసులు స్పా, మసాజ్ సెంటర్లపై దాడులు నిర్వహించి వ్యభిచారం దందా గుట్టు విప్పిన విషయం తెలిసిందే. ఈ వ్యాపారం నిర్వహిస్తున్నవారిలో కీలక పాత్రధారిగా గుర్తించి దాసరి సిద్ధార్థ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నెలసరి వేతనంపై పనిచేస్తున్న థాయ్‌లాండ్‌కు చెందిన ఓ మహిళలకు పోలీసులు విముక్తి కలిగించారు. వారిని తొలుత మసాజ్ చేయడానికంటూ నియమించుకుని తర్వాత వ్యభిచారం రొంపిలోకి దింపినట్లు తెలుస్తోంది.

నెలకు రూ. 40 వేల దాకా....
స్పా, మసాజ్ సెంటర్లలో పనిచేస్తున్న మహిళల్లో కొందరు నెలకు దాదాపు రూ.40 వేల దాకా సంపాదించినట్లు పోలీసులు గుర్తించారు. యజమాని ఇచ్చే వేతనం, విటులు సమర్పించే టిప్స్, కమిషన్ వంటి ఇతర రూపాల్లో కలిపి అంత వచ్చేదని అంటున్నారు.

విజిట్ వీసాపై వచ్చారు...
థాయ్‌లాండ్ మహిళలు విజిట్ వీసాపై హైదరాబాద్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. వారి వయస్సు 22 నుంచి 26 ఏళ్ల మధ్య ఉంటుంది. కెకె వారిని స్పా, మసాజ్ సెంటర్లలో నియమించినట్లు, ఆ తర్వాత వ్యభిచారంలోకి దింపినట్లు చెబుతున్నారు. మసాజ్ సర్వీసులకు రూ. 4 వేల చొప్పున, శృంగారానికి 8 వేల రూపాయల చొప్పున స్పా యజమానులు కస్టమర్ల నుంచి వసూలు చేసినట్లు చెబుతున్నారు.

ఆన్‌లైన్‌లో డబ్బులు....
నగదు రూపంలోనూ క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కస్టమర్లు డబ్బులు చెల్లించేవారు. కొంత మంది ఆన్‌లైన్‌లో చెల్లింపులు జరిపేవారని సమాచారం. డబ్బులు 12 బ్యాంకులకు బదిలీ అయినట్లు పోలీసులు గుర్తించారు. కొంత మంది మహిళలకు సిద్దార్థ్ స్పాలోనే వసతి ఏర్పాటు చేశాడు.

అద్దెకు తీసుకున్నాడు....
సిద్ధార్థ్ మహిళల కోసం హైదరాబాదులోని బంజారాహిల్స్‌లో త్రీ బెడ్రూం ఫ్లాట్స్ అద్దెకు తీసుకున్నాడు. అతను నెలకు రూ. 2 లక్షలు అద్దె చెల్లించేవాడు. శనివారం రాత్రి సైబరాబాద్ పోలీసులు ఆరు స్పాలపై దాడులు చేసి 65 మహిళలను, సిద్ధార్థ్ అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో 34 మంది థాయ్‌లాండ్ మహిళలు కాగా 21 మంది భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలకు చెందినవారు.
-
డబుల్ బెడ్ రూం ఇళ్లపై ప్రభుత్వం కీలక ప్రకటన- వీరికే, పంపిణీ ముహూర్తం ఫిక్స్...!! -
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications