వీడియో: గాంధీభవన్‌కు లైటింగ్ సరే..పార్టీని లైమ్‌లైట్‌లోకి తెస్తారా?: ఏడేళ్ల తరువాత డెకరేషన్
హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్‌గా నియమితుడైన రేవంత్ రెడ్డి ఇంకొన్ని గంటల్లో బాధ్యతలను స్వీకరించబోతోన్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నుంచి హేమాహేమీల్లాంటి నేతలు హాజరు కాబోతోన్నారు. ఈ మధ్యకాలంలో తెలంగాణ కాంగ్రెస్‌లో చోటు చేసుకున్న అతి కీలక పరిమాణం కావడం వల్ల రాజకీయంగా ఈ కార్యక్రమానికి ప్రాధాన్యత ఏర్పడింది. రేవంత్ రెడ్డి నియామకాన్ని తొలుత తీవ్రంగా వ్యతిరేకించిన సీనియర్లు సైతం ప్రస్తుతం మెత్తబడ్డారు.,మెట్టు దిగారు. రేవంత్ నాయకత్వాన్ని అంగీకరిస్తోన్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మొదలుకుని పలువురు పార్టీ సీనియర్ నేతలు ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నారు.
టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపడతున్న నేపథ్యంలో విద్యుద్దీపాలతో వెలిగిపోతోన్న గాంధీ భవన్...#TPCCRevanthReddy #revanthreddy #GandhiBhavan #oneindiatelugu pic.twitter.com/JCbECcB96H
— oneindiatelugu (@oneindiatelugu) July 7, 2021

గాంధీభవన్‌కు కొత్త అందాలు..
దీన్ని పురస్కరించుకుని తెలంగాణ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం గాంధీభవన్.. సరికొత్త అందాలను పుణికి పుచ్చుకుంది. విద్యుద్దీపాల ధగధగలతో మెరిసిపోతోంది. నాంపల్లిలో ఉన్న గాంధీభవన్‌లో సందడి నెలకొంది. గాంధీభవన్ ఒక చివర ఏఐసీసీ తాత్కాలిక అధినేత్రి సోనియాగాంధీ.. మరో చివర రాహుల్ గాంధీ నిలువెత్తు చిత్రపటాలను ఏర్పాటు చేశారు. బ్యానర్లు కట్టారు. కాంగ్రెస్ పార్టీ పతాకాన్ని తలపించేలా మూడురంగుల విద్యుద్దీపాలతో గాంధీభవన్‌ను డెకరేట్ చేశారు. ఏడేళ్ల తరువాత.. అంటే 2014 సార్వత్రిక ఎన్నికల తరువాత గాంధీభవన్ ఈ స్థాయిలో ముస్తాబు కావడం ఇదే తొలిసారి.

ఏడేళ్ల తరువాత
2014 తరువాత కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొన్న ఏ ఎన్నిక కూడా ఆశించిన ఫలితాలను ఇవ్వని విషయం తెలిసిందే. 2014, 2018-మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. కొద్దోగొప్పో ఊరట కలిగించే విషయం ఏదైనా ఉందంటే లోక్‌సభ ఎన్నికల ఫలితాలే. ఆ ఎన్నికల్లో మూడు స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోగలిగింది. మల్కాజ్‌గిరి, నల్లగొండ, భువనగిరి లోక్‌సభ స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. మల్కాజ్‌గిరి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న ఎంపీ రేవంత్ రెడ్డి.. పీసీసీ పగ్గాలను ఇంకాస్సేపట్లో అందుకోబోతోన్నారు. ఈ ఘట్టాన్ని పురస్కరించుకుని గాంధీభవన్‌ను ముస్తాబు చేశారు.

లైమ్‌లైట్‌లోకి వస్తుందా?
ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు వెలువడకపోవడం వల్ల గాంధీభవన్ కళను కోల్పోయింది. విజయోత్సవాలకు దూరమైంది. ఇలాంటి కోలాహలం సందర్భాల కోసం ఎదురు చూస్తోంది. గాంధీభవన్‌కు లైటింగ్ డెకరేషన్ మాట ఎలా ఉన్నప్పటికీ- పార్టీని లైమ్‌లైట్‌లోకి తీసుకొస్తారా? లేదా? అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ముందు ఉన్న టాస్క్.. హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక. మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెలంగాణ రాష్ట్ర సమితికి రాజీనామా చేయడం, బీజేపీలో చేరడం.. అదే పార్టీ నుంచి ఆయన పోటీ చేయడం ఖాయమైన ప్రస్తుత పరిస్థితుల్లో- హుజూరాబాద్ హర్డిల్‌ను రేవంత్ రెడ్డి ఎలా అధిగమించగలరనేది ఆసక్తిగా మారింది.
Recommended Video

హుజూరాబాద్ ఫలితంపైనే
దీనిపై రాజకీయాల్లో జోరుగా చర్చ సాగుతోంది. దుబ్బాక, నాగార్జున సాగర్, జీహెచ్ఎంసీల్లో చేదు ఫలితాలను ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీ.. హుజూరాబాద్‌లో ఎలా నెగ్గుకొస్తుందనేది ఆసక్తిగా మారింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక రేవంత్ రెడ్డి శక్తి సామర్థ్యాలు, వ్యూహాలకు అగ్నిపరీక్షగా మారుతుందనడంలో సందేహాలు అక్కర్లేదు. ఈ రేసులో ఆయన గెలవగలిగితే- ఇక కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకుని రావడంలో ఆయన విజయవంతమౌతారనడంలో సందేహాలు అక్కర్లేదనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమౌతోన్నాయి.
-
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !!












Click it and Unblock the Notifications