షాక్: రా రమ్మని దేవత పిలిచిందని మహిళ ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: దిగ్భ్రాంతికరమైన సంఘటన ఒకటి హైదరాబాదులో చోటు చేసుకుంది. తరుచుగా ఒకే కల ఆమెను వెంటాడుతూ వచ్చింది. దీంతో 27 ఏళ్ల ఆ గృహిణి స్వప్న ఆత్మహత్యయత్నం చేసుకుంది. ఈ సంఘటన హైదరాబాదులోని అడ్డగుట్టలో చోటు చేసుకుంది.
గత కొద్ది రోజులుగా ఆమె గ్రామదేవత గొంతు వింటోందని, తన వద్దకు రావాలని దేవత ఆమెను ఆహ్వానిస్తోందని ఆమె కల కంటూ వచ్చింది. సోమవారంనాడు భర్త బయటకు వెళ్లగా, పిల్లలిద్దరు బయట ఆటాడుకుంటున్నారు. ఆ సమయంలో దైవం వద్దకు వెళ్లడానికి తన ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆమె నిప్పంటించుకుంది.
అకస్మాత్తుగా ఆమె నిద్ర నుంచి లేచి వంటగదిలోకి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుంది. నీ వద్దకు వస్తున్నానంటూ నిప్పంటించుకుందని పోలీసు అధికారులు చెప్పారు.ఇంట్లోంచి మంటలు వస్తుండడంతో ఇరుగు పొరుగువారు వెళ్లి చూశారు.

అప్పటికే ఆమె శరీరం 50 శాతానికి పైగా కాలిపోయింది. ఆమెకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆమె ప్రాణాలకు ముప్పు లేదని వైద్యులు చెప్పారు. వరంగల్ జిల్లాకు చెందిన రాజుకు, స్వప్నకు తొమ్మిదేళ్ల క్రితం పెళ్లయింది. కొంత కాలం క్రితం నుంచి అడ్గగుట్టలో ఉంటున్నారు.
వారికి ఇద్దరు పిల్లలు. సమీపంలోని ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు. సోమవారంనాడు భర్త రాజు వరంగల్ వెళ్లాడు. పిల్లలు బయట ఆడుకుంటున్నారు. ఈ సమయంలో మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.












Click it and Unblock the Notifications