హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నవంబర్ 15న లేదా 20న మెట్రో రైల్ ప్రారంభం, మోడీని పిలిచాం: కెటిఆర్

హైదరాబాదులోని ఒలిఫెంటో స్టీల్ బ్రిడ్జ్, మెట్రో రైల్‌ స్టేషన్ల‌ను మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం సందర్శించారు. పనులు ఎలా జరుగుతున్నాయో అడిగి తెలుసుకున్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాదులోని ఒలిఫెంటో స్టీల్ బ్రిడ్జ్, మెట్రో రైల్‌ స్టేషన్ల‌ను మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం సందర్శించారు. పనులు ఎలా జరుగుతున్నాయో అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మెట్రో రైల్ ప్రాజెక్ట్ 2012 లో ప్రారంభమైందన్నారు. హైదరాబాద్ మహానగరంలో మెట్రో ప్రాజెక్టు చాలా సంక్లిష్టమైనదని చెప్పారు.

Hyderabad Metro Rail to begin trial runs from november 15

తొలి దశ మెట్రో రైలును నాగోల్ - మియాపూర్ వరకు 29 కి.మీ. మేర ప్రారంభించనున్నట్లు తెలిపారు. మెట్రోరైలును ప్రారంభించాలని ప్రధాని మోడీని కోరినట్లు చెప్పారు.

నవంబర్ 15 లేదా 20వ తేదీన మెట్రోరైల్ ప్రారంభం కానున్నట్లు తెలిపారు. మెట్రో స్టేషన్‌లోకి వెళ్లేందుకు నాలుగు మార్గాలు ఉంటాయని, మెట్రో స్టేషన్ దగ్గర ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

పాతపస్తీలో కూడా మెట్రో పనులు జరుగుతాయని తెలిపారు. ఈ విషయమై మజ్లిస్ అధినేత ఓవైసీతో మాట్లాడుతామని చెప్పారు. మెట్రోలో ప్రయాణీకులకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామన్నారు.

English summary
Trial run of Hyderabad Metro Rail (HMR) in the 30 km stretch, which is proposed for opening in the last week of November this year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X