మెట్రో కొత్త టికెట్ ధరలు ఇలా - 24 నుంచి అమలు..!!
హైదరాబాద్ మెట్రో ప్రయాణీకులకు భారీ ఊరట. టికెట్ ధరలను మెట్రో తగ్గించింది. కొత్త ధరల జాబితాను వెల్లడించింది. ఈ నెల 24 నుంచి కొత్త ధరలు అమలు కానున్నాయి. ఈ మధ్య కాలం లో టికెట్ ధరలు పెంచుతూ మెట్రో యాజమాన్యం నిర్ణయం వెల్లడించింది. దీని పైన పెద్ద ఎత్తున వ్యతిరేక వచ్చింది. దీంతో, మెట్రో యాజమాన్యం యూటర్న్ తీసుకుంది. పెంచిన మెట్రో ధరలను తగ్గిస్తూ నిర్ణయం ప్రకటించింది. పది శాతం మేర తగ్గించిన ధరలను వెల్లడించింది. తగ్గిన ఛార్జీలు రేపు (శనివారం) నుంచి అమల్లోకి రానున్నాయి.
హైదరాబాద్ మెట్రో ధరలు తగ్గాయి. కొత్త ధరలను మెట్రో ప్రకటించింది. ఫేర్ జోన్ వారీగా సవ రించిన ధరల ప్రకారం.. 2 కిలో మీటర్లలోపు ఛార్జీ రూ.11 గా ఉండనుంది. అదే విధంగా 2 నుంచి 4 కిలోమీటర్ల వరకు ఛార్జీ రూ.17. 4 నుంచి 6 కిలోమీటర్ల వరకు ఛార్జీ రూ.28గా నిర్ణయించారు. ఇక, 6 నుంచి 9 కిలోమీటర్ల వరకు ఛార్జీ రూ.37 గా ఉండనుంది. 9 నుంచి 12 కిలోమీటర్ల వరకు ఛార్జీ రూ.47 గా నిర్ణయించిన మెట్రో.. 12 నుంచి 15 కిలోమీటర్ల వరకు ఛార్జీ రూ.51 గా ఖరారు చేసారు. 15 నుంచి 18 కిలోమీటర్ల వరకు ఛార్జీ రూ.56గా ఉండనుంది. 18 నుంచి 21 కిలోమీటర్ల వరకు ఛార్జీ రూ.61గా నిర్దారించారు. 21 నుంచి 24 కిలోమీటర్ల వరకు ఛార్జీ రూ.65
24 ఆపై కిలోమీటర్లకు ఛార్జీ రూ.69గా ఫిక్స్ చేసారు.

ఫేర్ ఫిక్సేషన్ కమిటీ నిర్ణయించిన పెంపునకు సంబంధించి ప్రయాణికులకు 10 శాతం డిస్కౌంటు ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, మే 24 నుంచి పేపర్ క్యూఆర్/టోకెన్, డిజిటల్ టికెట్లు, స్మార్ట్ కార్డులు.. అన్ని చెల్లింపులకు వర్తిస్తుంది. ప్రయాణికులు స్మార్ట్ కార్డులు, డిజిటల్ ప్లాట్‌ఫాంలను ఉపయోగించి స్మార్ట్‌గా ప్రయాణించాలని ప్రయాణికులకు మెట్రో సంస్థ విజ్ఞప్తి చేసింది. అందుబాటు స్థాయిలో టికెట్ ధరలు ఉంచాలనే లక్ష్యంతో వీటిని ఖరారు చేసినట్లు హైదరాబాద్ మెట్రో వెల్లడించింది.












Click it and Unblock the Notifications