హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆమ్నీషియా పబ్ గ్యాంగ్ రేప్ కేసు: మొత్తం ఐదుగురు నిందితులు అరెస్ట్, ఎవరెవరంటే?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్‌లో ఓ పబ్‌కు వచ్చిన 17 ఏళ్ల బాలికపై కారులోనే సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనంగా మారింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనలో.. మొత్తం ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ఉదయం మరో ముగ్గురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. బాలికపై సామూహిక అత్యాచార ఘటనపై రాజకీయంగా దుమారం రేగింది. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ప్రతిపక్షాలు ధర్నాలు, ఆందోళనలు చేశాయి.

దాదాపు వారం రోజుల క్రితం ఆమ్నీషియా పబ్‌లో పరిచయమైన ఒక బాలికను ఇంటికి తీసుకెళ్తామని మాయమాటలు చెప్పి, ఆమెపై ముగ్గురు బాలురు, ఇద్దరు యువకులు కారులో సామూహిక అత్యాచారం చేశారు. వీరిలో ఒక ప్రభుత్వ సంస్థకు కొత్తగా ఛైర్మన్‌గా ఎన్నికైన నాయకుడి కుమారుడు, అతడి స్నేహితులు ఉన్నారు. వీరిలో సాదుద్దీన్‌ మాలిక్‌ అనే యువకుడిని శుక్రవారం రోజున పోలీసులు అరెస్టు చేశారు.

 Hyderabad Minor Girl Rape Case: Total five Accused Arrested

శనివారం ఉదయం నిందితుడైన ఓ మైనర్‌​ను హైదరాబాద్‌​లో అదుపులోకి తీసుకున్న వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్పోలీసులు పరారీలో ఉన్న మరో ముగ్గురిని కర్ణాటకలో అరెస్టు చేసినట్లు ​తెలిపారు. కర్ణాటకలో తల దాచుకున్న ఉమర్​ఖాన్​ అనే వ్యక్తితో పాటు మరో ఇద్దరు మైనర్​లను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. అరెస్టైన నిందితుల్లో వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ కుమారుడు కూడా ఉన్నట్లు సమాచారం. కాగా, ఆరు రోజుల కిందట ఈ ఘటన చోటుచేసుకోగా.. భయంతో బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పలేదు. ఆమె శరీరంపై గాయాలు చూసి.. తండ్రి ఫిర్యాదు చేయగా, జూబ్లీహిల్స్‌ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.

బాలిక షాక్‌ నుంచి తేరుకున్న తర్వాత.. భరోసా కేంద్రంలో మహిళా పోలీసులు బుధవారం రాత్రి ఆమెతో మాట్లాడారు. దీంతో వాస్తవం బయటికొచ్చింది. తనపై కొందరు సామూహిక అత్యాచారం చేశారంటూ ఆమె విలపించింది. దీంతో పోలీసులు అత్యాచారం సెక్షన్లు జోడించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారు ప్రజాప్రతినిధుల సంతానమైనందునే పోలీసులు చర్యలు తీసుకోవడంలేదంటూ బీజేపీ, కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌ పోలీసు పోలీస్ స్టేషన్ వద్ద శుక్రవారం సాయంత్రం ధర్నా చేశారు.

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 36లోని అమ్నీషియా పబ్‌లో మే 28న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 6 గంటల వరకు ఒక బృందం మద్యం రహిత (నాన్‌ లిక్కర్‌ ఈవెంట్‌) వేడుకను నిర్వహించింది. ఇందులో 150 మంది పాల్గొన్నారు. వీరిలో 80 శాతానికి పైగా మైనర్లే. వారిలో ఒక బాలిక పబ్‌లో పరిచయమైన స్నేహితులతో సరదాగా గడిపింది. సాయంత్రం 5.45 గంటల ప్రాంతంలో ఒక బాలుడు (16), మిగిలిన స్నేహితులతో కలిసి కిందకు వచ్చింది. వారిలో ప్రభుత్వ సంస్థ(వక్ఫ్ బోర్డ్) ఛైర్మన్‌ కుమారుడు, ఒక ఎమ్మెల్యే కుమారుడు, మరికొందరు ఉన్నారు. వారు బాలికను బెంజి కారులో ఎక్కించుకుని.. బంజారాహిల్స్‌లోని ఓ బేకరీ వద్దకు వెళ్లారు. అక్కడ అరగంటపాటు అక్కడ గడిపారు. వేరే కారులో ఇంట్లో దింపుతామంటూ ప్రభుత్వ సంస్థ ఛైర్మన్‌ కుమారుడు బాలికకు చెప్పాడు. ఆమెను వెంటబెట్టుకుని 6.30 గంటల ప్రాంతంలో అతడు, మరో ఐదుగురు ఇన్నోవా వాహనంలో బయలుదేరారు. మధ్యలో ఎమ్మెల్యే కుమారుడు దిగి వెళ్లిపోయినట్లు సీసీ కెమెరాల్లో దృశ్యాలను పోలీసులు గుర్తించారు. మిగిలిన ఐదుగురు ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కారులోనే అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు. అనంతరం నిందితులు బాధితురాలినిఅమ్నీషియా పబ్‌ వద్ద దింపేసి వెళ్లారు.

English summary
Hyderabad Minor Girl Rape Case: Total five Accused Arrested.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X