హైదరాబాద్ TO నాగార్జునసాగర్.. బడ్జెట్ టూర్ ప్యాకేజీ.. బుకింగ్స్ ఓపెన్..!
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అద్భుతమైన పర్యటక ప్రాంతాల్లో నాగార్జున సాగర్ ఒకటి. సాగర్ లో కృష్ణమ్మ పరవళ్లను తనివితీరా చూడాలని చాలా మందికి ఉంటుంది. ఇప్పుడు వర్షాకాలం కావడంతో చాలా మంది వాటర్ ఫాల్స్, డ్యామ్ లను చూడాలని అనుకుంటూ ఉంటారు. ఫ్యామిలీతో కలిసి వెళ్లేలా ప్లాన్ చేసుకుంటారు. ముఖ్యంగా వీకెండ్స్ లో ఎక్కువ మంది వీటిని సందర్శించడానికి వెళ్తుంటారు. హైదరాబాద్ నగరానికి కూడా నాగార్జునసాగర్ దగ్గరగా ఉన్న నేపథ్యంలో చాలామంది ఈ ప్రాంతానికి వెళ్లడానికే ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటి వారి కోసం తెలంగాణ టూరిజం శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ - నాగార్జునసాగర్ - హైదరాబాద్ పేరుతో తెలంగాణ టూరిజం సరికొత్త టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ బడ్జెట్ టూర్ లో భాగంగా ఉదయం వెళ్లి మళ్లీ రాత్రి వరకు ఇంటికి తిరిగి రావొచ్చు. ప్రతీ శని, ఆదివారం రోజుల్లో ఈ టూర్ ఉంటుంది. హైదరాబాద్ నుంచి బస్సు జర్నీ ద్వారా దీనిని నిర్వహిస్తున్నారు.
ఈ టూర్ ధర ఒక్కొక్కరికీ దాదాపు రూ. 1000 గా నిర్ణయించారు. టూర్ కు సంబంధించిన పూర్తి వివరాలు అంటే ప్రయాణ వేళలు, రూట్ మ్యాప్, బుకింగ్స్ వివరాలన్నీ తెలంగాణ టూరిజం అధికారిక పోర్టల్ లో పొందుపరిచారు. ఈ మేరకు సెప్టెంబర్ 5,6 తేదీల్లో వెళ్లేందుకు బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఈ టూర్ లో భాగంగా ఈ పర్యటనలో నాగార్జునసాగర్ డ్యామ్ వ్యూ, బుద్ధవనం సందర్శనతో పాటు సరదాగా బోటింగ్ చేసే అవకాశం కూడా అందిస్తోంది. తక్కువ ఖర్చుతో.. తక్కువ సమయంలోనే వీకెండ్ ఎంజాయ్ చేయాలనుకునే ఫ్యామిలీలు, కపుల్స్, ఫ్రెండ్స్ కు ఈ టూర్ పర్ ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పాలి. ఇక ప్రయాణం వివరాలు చూస్తే.. ప్రతి శనివారం, ఆదివారం ఉదయం 7 గంటల 30 నిమిషాలకు హైదరాబాద్ పర్యాటక భవన్ నుంచి బస్సు బయలుదేరుతుంది. అలాగే ఉదయం 8 గంటలకు బషీర్ బాగ్ లోని సీఆర్ఓ భవన్ నుంచి బస్సు స్టార్ట్ అవుతుంది.

ఇక జర్నీ స్టార్ట్ అయ్యాక ఉదయం 11 గంటల 30 నిమిషాలకు నాగార్జునసాగర్ చేరుకుంటారు. ఉదయం 11:40 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు అంతర్జాతీయ స్థాయిలో డెవలప్ మెంట్ చేసిన బుద్ధవనం ప్రాజెక్ట్ ను సందర్శిస్తారు. ఆ తర్వాత ఒంటి గంట నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు లంచ్ బ్రేక్ ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు లాంచీలో ప్రయాణం ఉంటుంది. అక్కడ నాగార్జున సాగర్ మ్యూజియం, నాగార్జున కొండను సందర్శిస్తారు. అక్కడే బోటింగ్ సదుపాయం కూడా ఉంది. ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకు తిరుగు ప్రయాణం స్టార్ట్ అవుతుంది. ట్రాఫిక్ పరిస్థితులను బట్టి రాత్రి 9 గంటల కల్లా హైదరాబాద్ చేరుకుంటారు. ఛార్జీల వివరాలు చూస్తే పిల్లలకు రూ. 640 కాగా పెద్దలకు రూ. 800 లుగా ఉంది. అయితే బోటింగ్ ఫీజు, ఎంట్రీ, భోజనం వంటివి టూర్ ప్యాకేజీలో ఉండవు. వీటిని ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications