వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు సమన్లు: 20న హాజరుకావాలని ఆదేశం, ఏ కేసులోనంటే?

హైదరాబాద్: పోలీసులపై దాడి కేసులో వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మలకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. జూన్ 20వ తేదిన విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఏప్రిల్ 24న నిరుద్యోగ సమస్యలపై దీక్షకు సిద్ధమైన ఆమెను పోలీసులు అడ్డుకోవడంతో.. వారితో వాగ్వానికి దిగారు షర్మిల. తనను ఎందుకు ఆపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో చివరికి పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే అరెస్ట్ క్రమంలో బందోబస్తులో ఉన్న పోలీసులపై ఆమె చేయి చేసుకున్నారు. మహిళా పోలీసుపై దాడి చేశారు. ఈ దశ్యాలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.

Hyderabad: Nampally court issues summons to ys sharmila, directs to appear on 20th june

ఈ దాడి ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఆమె కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. చివరికి సోమవారం ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. దీంతో విచారణకు హాజరుకావాలంటూ షర్మిలకు న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలో 20న షర్మిల నాంపల్లి కోర్టులో హాజరుకానున్నారు.

ఇది ఇలావుండగా, తెలంగాణ ప్రభుత్వంపై షర్మిల తన విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. రైతులను నిండా ముంచి, ఓట్ల కోసం "రైతు దినోత్సవం" నిర్వహించిన కేసీఆర్ దొరకు.. చెంప చెల్లుమనేలా సమాధానం ఇచ్చారు రైతన్నలు. "రైతు దినోత్సవం" కంటే "రైతు దగా దినోత్సవం" అంటేనే కేసీఆర్‌కు అబ్బుతుంది. రుణమాఫీపై, పంట పరిహారంపై బంధిపోట్లను నిలదీస్తుంటే కేసీఆర్ కు సిగ్గు కూడా అనిపించడం లేదు. అసలు కేసీఆర్ ఏం సాధించారని రైతు దినోత్సవాలు? లక్ష లోపు రుణమాఫీ అని చెప్పి, 31లక్షల మంది రైతులను మోసం చేసినందుకా? ఏటా 26 లక్షల టన్నుల ఎరువులు ఉచితంగా ఇస్తామని దగా చేసినందుకా? తొమ్మిదేండ్లలో 9వేల మంది రైతులను పొట్టనపెట్టుకున్నారు అంటూ షర్మిల విమర్శలు గుప్పించారు.

అంతేగాక, 'పంట నష్టపరిహారానికి దిక్కులేదు. పంట బీమాకు మోక్షం లేదు. ఎకరాకు ముష్టి రూ.5వేల రైతుబంధు ఇచ్చి.. ఇన్ పుట్ సబ్సిడీ, రాయితీ ఎరువులు, విత్తనాలు, యంత్ర లక్ష్మి వంటి రూ.30వేల రైతు పథకాలను బొంద పెట్టాడు. వందల ఎకరాలు ఉన్న భూస్వాములకు రూ.కోట్లు చెల్లించి, దర్జాగా మేపుతున్నాడు. ప్రతీ ఎకరాకు నీళ్లు ఇస్తానని చెప్పి, కాళేశ్వరం పేరుతో రూ.1.21లక్షల కోట్ల అప్పు తెచ్చి, కమీషన్లు దోచుకున్నాడు.

పాత ప్రాజెక్టులను పాతరేసి, కొత్త ప్రాజెక్టులను పూర్తి చేయని చేతికాని దద్దమ్మ కేసీఆర్. వరి వేస్తే ఉరేనని, కౌలు రైతు రైతే కాదని భయభ్రాంతులకు గురి చేసి, రైతుల ప్రాణం తీశాడు. రైతు బీమా పథకాన్ని 60 ఏండ్లకే పరిమితం చేసి, రైతులకు వెన్నుపోటు పొడిచాడు అంటూ షర్మిల విరుచుకుపడ్డారు.

Hyderabad: Nampally court issues summons to ys sharmila, directs to appear on 20th june

రైతులు పండించిన వడ్లను కొనకుండా.. ముప్పుతిప్పలు పెట్టి, కల్లాల్లోనే రైతుల గుండెలు ఆగేలా చేశాడు. మిల్లర్లు దోపిడీకి పాల్పడుతున్నా, అగ్గువకే వడ్లు కొంటున్నా దొరికినంతా దోచుకోండని చెప్పిన దోపిడీదారుడు కేసీఆర్. వ్యవసాయం అంటే మహానేత వైయస్ఆర్ కాలంలో పండుగ.. ఇప్పుడు తాలిబాన్ కేసీఆర్ కాలంలో దండగ. BRS అంటే కిసాన్ సర్కార్ కాదు.. కిసాన్‌ను నిండా ముంచే సర్కారు.

రైతులను అప్పులపాలు చేసి, ఆత్మహత్యల బాట పట్టిస్తున్న కేసీఆర్ కి బుద్ది చెప్పేది రైతులే. రానున్న ఎన్నికల్లో కేసీఆర్ కి గడ్డి తినిపించేది రైతులే.ఇప్పటికైనా రైతులు పరిహారమే వద్దన్నారని సొల్లు కబుర్లు చెప్పకుండా వారం రోజుల్లో 15 లక్షల ఎకరాల్లో నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలి. మిగిలిపోయిన 30 లక్షల టన్నుల ధాన్యం వెంటనే కొనాలని వైయస్సార్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు షర్మిల.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+