హైదరాబాద్‌లో కొత్త చట్టం అమలు

Bharathiya Nyaya Sanhitha: భారతీయ న్యాయ సంహిత.. నేటి నుంచి దేశంలో అమల్లోకి వచ్చింది. దీని కింద పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. వేర్వేరు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు స్థానిక పోలీసులు. తెలంగాణలోనూ ఇది కార్యరూపం దాల్చింది. హైదరాబాద్‌లో తొలి కేసు నమోదైంది.

భారతీయ శిక్షాస్మృతికి ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం భారతీయ న్యాయ సంహితను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. గత ఏడాదే అది పార్లమెంట్ ఆమోదం పొందింది. చట్ట రూపాన్ని దాల్చింది. దీనితో- నేటి నుంచి ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత 2023 తెరమీదికివచ్చింది.

Hyderabad Police has registered the First FIR under the Bharathiya Nyaya Sanhitha

క్రిమినల్ ప్రొసీజర్‌కు బదులుగా నాగరిక్ సురక్ష సంహిత అమలువుతుంది ఇప్పటి నుంచి. కొత్త చట్టం కింద హైదరాబాద్‌లో తొలి కేసు నమోదైంది. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ సౌత్ జోన్ పరిధిలోని చార్మినార్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ 144/2024ను నమోదు చేశారు.

భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 281, మోటార్ వెహికల్ యాక్ట్‌లోని 80 (ఏ) కింద ఈ కేసును రిజిస్టర్ చేశారు చార్మినార్ పోలీసులు. మధ్యాహ్నం ఒంటిగంటకు కేసు రిజిస్టర్ అయినట్లు పోలీసులు తమ ఎఫ్ఐఆర్ కాపీలో పొందుపరిచారు. దీనికి సంబంధించిన వివరాలను తెలంగాణ పోలీస్ డైరెక్టర్ జనరల్ రవి గుప్తా వెల్లడించారు. ఎఫ్ఐఆర్ కాపీని తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+