వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో తెలుగు విద్యార్ధి ఆత్మహత్య: పిరికివాడు కాదన్న మామ (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అమెరికాలో ఉన్నత చదువును అభ్యసించేందుకు వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన ఐఐటీ విద్యార్థి బండి శివకిరణ్ (25) ఆత్మహత్యకు పాల్పడి తనువు చాలించిన సంగతి తెలిసిందే. రెండురోజుల్లో ఇంటికి తిరిగి వస్తానని చెప్పిన యువకుడు తిరిగిరాని లోకాలకు చేరాడని తల్లిదండ్రులకు, కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

చిన్నప్పటి నుంచి బాగా చదివేవాడని, ఐఐటీలో కూడా టాప్ ర్యాంకర్ అని మృతుడి మేనమామ మల్లేష్ పేర్కొన్నారు. అతడు ఆత్మహత్య చేసుకునే అంత పిరికివాడు కాదని, తనతో ఎప్పుడూ మాట్లాడుతూ ఉండేవాడని ఆయన తెలిపారు. అమెరికాలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలు, ఒత్తిడితోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడనే సందేహాన్ని వ్యక్తంచేశారు.

అమెరికాలో తెలుగు విద్యార్ధి ఆత్మహత్య

అమెరికాలో తెలుగు విద్యార్ధి ఆత్మహత్య


అనంతరం పలు సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు వచ్చినా వాటిని కాదని ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. ఎంఎస్ మొదటి సంవత్సరం పూర్తి చేశాడు. ఎప్పుడూ చదువులో ముందుండే శివ కిరణ్ తాను అనుకున్న గోల్ సాధించకపోవడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు అతడి స్నేహితులు చెబుతున్నారు.

 అమెరికాలో తెలుగు విద్యార్ధి ఆత్మహత్య

అమెరికాలో తెలుగు విద్యార్ధి ఆత్మహత్య


ఎంఎస్ చేయడానికి అమెరికాలోని రాలే ప్రాంతానికి వెళ్లి చైనాకు చెందిన ఇద్దరు విద్యార్థులతో ఓ గదిలో కలిసి ఉంటున్నాడు. మొదటి సెమిస్టర్‌లో మంచి ర్యాంకు సాధించాడు. రెండు రోజుల క్రితం విడుదలైన రెండో సెమిస్టర్ ఫలితాల్లో తాను అనుకున్న ర్యాంక్ రాకపోవడంతో మనస్తాపానికి గురైన శివ కిరణ్ క్యాంపస్‌లోని హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు.

 అమెరికాలో తెలుగు విద్యార్ధి ఆత్మహత్య

అమెరికాలో తెలుగు విద్యార్ధి ఆత్మహత్య


మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కరాజు పేట గ్రామానికి చెందిన బండి శివకరణ్ తన తల్లిదండ్రులు ఉమాశంకర్, పద్మలతో కలిసి కొన్నేండ్లుగా రామంతాపూర్‌లోని ఇందిరానగర్‌లో నివాసముంటున్నారు. తండ్రి ఉమాశంకర్ వైద్యశాఖలో ఉద్యోగం చేస్తుండగా, తల్లి పద్మ మాసబ్‌ట్యాంక్‌లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు.

 అమెరికాలో తెలుగు విద్యార్ధి ఆత్మహత్య

అమెరికాలో తెలుగు విద్యార్ధి ఆత్మహత్య

ఇదిలా ఉండగా వర్సిటీకి సెలవులు ప్రకటించడంతో ఇంటికి వస్తున్నానని చెప్పినట్టు కుటుంబసభ్యులు పేర్కొన్నారు. గురువారం ఉదయం కూడా మాట్లాడిన శివకరణ్.. ఆత్మహత్య చేసుకున్నట్టు తెలియడంతో కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. శివకిరణ్ మృతదేహాన్ని స్వస్థలానికి రప్పించడానికి కేంద్రమంత్రి దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, పద్మారావుగౌడ్ ప్రయత్నాలు చేపట్టారు.

మృతుడి తల్లిదండ్రుల ఆరోగ్యపరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని ఆయన తెలిపారు. శివకరణ్ మృతి చెందాడనే వార్త తెలియడంతో రామంతపూర్‌లోని ఇందిరానగర్‌లో విషాదఛాయలు అలుముకొన్నాయి. హైదరాబాద్ ఐఐటీలో ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేసి, గతేడాది ఆగస్టులో ఉన్నత విద్యాభ్యాసం కోసం ఏడాది కిందట అమెరికా వెళ్లాడు.

చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండే ప్రాథమిక విద్యను హఫ్సీగూడలోని జాన్సన్ గ్రామర్ స్కూల్‌లో పూర్తి చేశాడు. ఇంటర్ మీడియట్‌ను నారాయణ కళాశాలలో పూర్తిచేశాడు. అనంతరం మెదక్ జిల్లా ఎద్దుమైలారంలోని ఐఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.

English summary
A student from Hyderabad studying in North Carolina University in the US committed suicide after scoring low marks in exams, according to information reaching his family here. Shiva Kiran (23) ended his life by hanging from the ceiling fan in his room in the university hostel on Thursday. The authorities in the US informed the distraught family today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X