చంద్రబాబు, రేవంత్‌రెడ్డికి శుభవార్త వినిపించిన నరేంద్రమోడీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు మధ్య ప్రస్తుతం ఉన్న నాలుగు లైన్ల రహదారిని త్వరలోనే 12 లైన్లకు విస్తరించబోతున్నారు. ఈ రహదారి పొడవు మొత్తం 576 కిలోమీటర్లు కాగా తెలంగాణలో 210 కిలోమీటర్ల, ఏపీలో 260 కిలోమీటర్లు, కర్ణాటకలో 106 కిలోమీటర్ల పొడవు ఉంది. ఈ రెండు మహానగరాల మధ్య ఈ రహదారిలో ప్రయాణించాలంటే తీవ్రమైన రద్దీ నెలకొంటుంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

మారనున్న రాయలసీమ ముఖచిత్రం
రెండూ అభివృద్ధి చెందిన నగరాలే కాబట్టి వీటిల్లో పలు ఐటీ కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు కొలువుదీరాయి. హైదరాబాద్-బెంగళూరు మధ్య ప్రతి రోజు వేలసంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటారు. ఈ రహదారిని విస్తరించంతోపాటు దీని వెంబడి ఎకానమీ జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వాటికి ప్రోత్సాహకాలు కూడా అందించబోతున్నారు.

Hyderabad to Bangalore high way is being upgraded to a 12 lane highway

ఈ రోడ్డు విస్తరణ వల్ల ప్రధానంగా రాయలసీమ పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఏర్పడింది. ఈ హైవే మన రాష్ట్రంలో కర్నూలు నుంచి ప్రారంభమై శ్రీసత్యసాయి జిల్లాలోని కొండికొండ వద్ద ముగుస్తుంది. కర్నూలు, డోన్, గుత్తి, అనంతపురం, పెనుకొండ మీదుగా వెళుతుంది. ఈ రోడ్డువల్ల రాయలసీమ ముఖచిత్రమే మారిపోనుంది.

విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా

ఏపీ ప్రభుత్వం హైదరాబాద్ నుంచి అమరావతి మధ్య కొత్తగా ఎక్స్ ప్రెస్ వే నిర్మించాలని కోరగా కేంద్రం అంగీకారం తెలిపింది. ప్రస్తుతం హైదరాబాద్-అమరావతి మధ్య 220 కిలోమీటర్ల దూరం ఉంది. కొత్త రహదారితో ఈ రెండు నగరాల మధ్య 70 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. దీనివల్ల ప్రస్తుతం విజయవాడ-హైదరాబాద్ హైవేపై ఒత్తిడి తగ్గుతుంది. గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వే నిర్మించాలని ఏపీ ప్రభుత్వం కోరుతోంది. విభజన హామీ చట్టంలోను దీని ప్రస్తావన ఉండటంతో అంగీకరిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+