తక్కువ ధరకు బియ్యం ఇస్తానని వివాహితపై అత్యాచారం
నాణ్యమైన బియ్యం ఇస్తామని ఆశచూపి ఓ వివాహితపై బియ్యం దుకాణం యజమాని అత్యారాచారానికి పాల్పడ్డాడు.ఈ ఘటన సనత్ నగర్ లో చోటుచేసుకొంది.బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
హైదరాబాద్: నాణ్యమైన బియ్యం ఇస్తామని ఆశచూపి ఓ వివాహితపై బియ్యం దుకాణం యజమాని అత్యారాచారానికి పాల్పడ్డాడు.ఈ ఘటన సనత్ నగర్ లో చోటుచేసుకొంది.బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
45 ఏళ్ళ ఓ వివాహిత బియ్యం కొనుగోలు చేసేందుకుగాను సనత్ నగర్ లో ఆశోక్ అనే వ్యక్తి దుకాణానికి వెళ్ళింది,.అయితే దుకాణంలో ఉన్న బియ్యం కంటే తన ఇంటివద్ద నాణ్యమైన బియ్యం ఉన్నాయని బాధితురాలిని ఆశోక్ నమ్మించాడు.

వివాహితను ఆయన తన ఇంటికి తీసుకెళ్ళాడు. వివాహిత బియ్యం నాణ్యతను పరిశీలిస్తుండగా ఆశోక్ అతనికి సహయకుడిగా ఉన్న వ్యక్తి సహయంతో అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అయితే ఈ ఘటన ఆదివారం నాడు చోటుచేసుకొంది.అయితే బాధితురాలు ఆలస్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును ఆధారంగా చేసుకొని పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ఆశోక్ కోసం పోలీసులు గాలింపు చర్యలను చేపట్టారు.












Click it and Unblock the Notifications