కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం: ప్రధాన నిందితుడి అరెస్ట్
హైదరాబాద్: కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు. తెలంగాణలోని నిర్మల్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ స్లీపర్ బస్సులో మహిళపై అత్యాచారం ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. బాధితురాలి ఫిర్యాదుతో మొదట ఒక నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. తాజాగా ప్రధాన నిందితుడిని కటకటాల వెనక్కి నెట్టారు.
నిర్మల్ జిల్లా నుంచి ప్రకాశం వెళ్తున్న తనపై.. బస్సు డ్రైవర్ నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం చేశాడని డయల్ 100 ద్వారా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ సమీపంలో బస్సును ఆపి సీజ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి మాట్లాడారు.

బాధితురాలు అత్యాచారానికి గురైనట్లు అర్ధరాత్రి ఫిర్యాదు చేశారు. నెల్లూరుకి చెందిన ఈర్ల కృష్ణ బాబు, ప్రకాశం జిల్లాకు చెందిన సిద్ధయ్య అనే ఇద్దరు డ్రైవర్లు బస్సులో ఉన్నారు. రాత్రి భోజనం తరువాత సిద్ధయ్య బస్సు నడుపుతుండగా.. మరో డ్రైవర్ కృష్ణబాబు బాధితురాలిని అత్యాచారం చేశాడు.
బాధితురాలు తన కూమార్తెతో కలిసి ప్రయాణం చేసేందుంకు ఒక బెర్త్ బుక్ చేసుకుంది. ఇద్దరికి ఒక బెర్త్‌లో ఇబ్బంది ఉంటుందని వెనకాల ఉన్న బెర్త్‌లోకి వెళ్లాలని సిద్ధయ్య సూచించాడు. మహిళ నిద్రలోకి జారుకున్నాక అఘాయిత్యానికి పాల్పడినట్లు డీసీపీ బాలస్వామి వెల్లడించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు 64(1) బీఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి.. నిందితులు ఈర్ల కృష్ణ బాబు, సిద్దయ్యను అరెస్టు చేసినట్లు డీసీపీ తెలిపారు.












Click it and Unblock the Notifications