హైదరాబాద్ లో ఆ షోరూమ్ లను చూసి బిత్తరపోయిన హైడ్రా- మెరుపుదాడులు, సీజ్..!!
ఎండాకాలం సమీపిస్తోన్న నేపథ్యంలో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) రంగంలోకి దిగింది. ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. హైదరాబాద్‌లో అగ్నిమాపక భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన పలు వాణిజ్య సంస్థలను సీజ్ చేస్తోంది. గత రెండు రోజుల్లో ఎనిమిది వాణిజ్య సంస్థలు, షాపులకు తాళాలు వేసింది. హైడ్రా నిర్వహించిన మెరుపు తనిఖీల సందర్భంగా తీవ్ర భద్రత లోపాలు వెలుగులోకి రావడమే దీనికి కారణం.
ప్రత్యేకించి బేస్‌మెంట్‌లను నిల్వ కేంద్రాలుగా ఉపయోగించినవి వీటిల్లో అధికంగా ఉన్నాయి. చిన్న అగ్నిప్రమాదం సంభవించినా అత్యవసరంగా బయటికి వెళ్లడానికి ఎటువంటి వీలూ లేని విధంగా కొన్ని షాపులు, వాణిజ్య సంస్థలను నిర్మించినట్లు హైడ్రా గుర్తించింది. అటువంటి వాటిపై మున్ముందు మరిన్ని ఆకస్మిక దాడులు, తనిఖీలను నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. వేసవిలో అగ్నిప్రమాదాలు సంభవించే అవకాశాలు అధికంగా ఉండటం, ఇటీవలే ఓ ఫర్నిచర్ షాప్ లో మంటలంటుకోవడం వంటి పరిణామాల నేపథ్యంలో హైడ్రా తాజా చర్యలు చేపట్టింది.

హైడ్రా అధికారులు నిర్వహించిన ఈ తనిఖీల్లో.. బేస్‌మెంట్‌లు నిల్వ కేంద్రాలుగా మారడం, అగ్నిమాపక కేంద్రాల నుంచి ఎటువంటి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ తో పాటు సరైన అనుమతులు తీసుకోకపోవడం వంటి ఉల్లంఘనలు బయటపడ్డాయి. వాటర్ స్ప్రింక్లర్లు, స్మోక్ డిటెక్టర్లు, అగ్నిమాపక పరికరాలు వంటి కనీస భద్రత ప్రమాణాలు కూడా అనేక చోట్ల అందుబాటులో లేవనే విషయం వెలుగులోకి వచ్చిందీ దాడులతో.
హైడ్రా ఇప్పటివరకు సీజ్ చేసిన సంస్థల్లో నీరూస్ ఎంపోరియో షోరూమ్- జూబ్లీహిల్స్, స్టాండర్డ్ ఫర్నిచర్ షోరూమ్- నాంపల్లి, లుకింగ్ గుడ్ ఫర్నిచర్ స్టోర్- గచ్చీబౌలి, అను ఫర్నిచర్స్- కొంపల్లి, నాచారం, రాయల్ ఓక్ ఫర్నిచర్- కూకట్‌పల్లి, అత్తాపూర్, బాంటియా ఫర్నిచర్- ఉప్పల్ రోడ్ ఉన్నాయి. మంటలు చెలరేగితే శరవేగంగా అవి వ్యాప్తి చెందడానికి అనుకూల వస్తువులు ఉండటం వల్ల ఫర్నిచర్ షాప్స్ మీదే తొలుత నిఘా పెట్టింది హైడ్రా.
జీహెచ్‌ఎంసీ, హైడ్రా, అగ్నిమాపక, డిస్కమ్ అధికారులు సంయుక్తంగా ఈ తనిఖీలు నిర్వహించారు. మొదటి రోజు దాడులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్వయంగా పర్యవేక్షించారు. బేస్‌మెంట్‌లలో సరుకులు, పనిముట్లను నిల్వ ఉంచుతున్నట్లు అనేకచోట్ల వెల్లడైంది. నీరూస్ ఎంపోరియోలో మూడు బేస్‌మెంట్లు, నాలుగు అంతస్తులు, భవనం పైన అక్రమంగా నిర్మించిన షెడ్‌ను దుస్తుల నిల్వకు ఉపయోగించినట్లు హైడ్రా తెలిపింది.
ఈ భవనానికి ఫైర్ ఎన్‌ఓసీ లేకపోవడంతో పాటు పనిచేయని అగ్నిమాపక యంత్రాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే, నాంపల్లిలోని స్టాండర్డ్ ఫర్నిచర్ దుకాణం బేస్‌మెంట్‌తో పాటు ఆరు అంతస్తులను ఫర్నిచర్‌తో నింపి, అత్యవసర మార్గాలను మూసివేసింది. ఈ షాపునకు కూడా ఫైర్ ఎన్‌ఓసీ, తగిన భద్రతా పరికరాలు లేవని అధికారులు వెల్లడించారు. సీజ్ చేసిన భవనాల చుట్టూ అధికారులు బారికేడ్లు అమర్చారు. నో ఫైర్ సేఫ్టీ అనే బోర్డులను ఏర్పాటు చేశారు. విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.
-
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications