'చంద్రబాబు-కెసిఆర్ మధ్య నేనే సయోధ్య కుదిర్చా, సంతోషంగా ఉంది'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుల మధ్య తాను మధ్యవర్తిగా వ్యవహరించానని, తద్వారా ఇరువరి మధ్య సయోధ్య కుదిర్చానని ఓటుకు నోటు కేసులో నిందితుడు జెరూసలేం మత్తయ్య చెప్పారు.
ప్రస్తుతం ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య సయోధ్య కుదిరిందని, వారిద్దరు మధ్య శాంతిసామరస్యం వెల్లువిరుస్తుండటం తనకు సంతోషాన్ని ఇస్తోందని చెప్పారు. తాను రెండు రాష్ట్రాల్లో పర్యటిస్తానని, ప్రజల సమస్యలను స్థానిక నేతలకు తెలియజేస్తానని మత్తయ్య చెప్పారు.

కాగా, ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ అంశాలు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు, ఫోన్ ట్యాపింగ్ కేసులో కెసిఆర్‌కు చిక్కులు వస్తాయని అందరు భావించారు. అయితే, ఇరువురు సీఎంలు పట్టుదలకు పోకుండా రాష్ట్రాల అభివృద్ధిపై దృష్టి సారించాలని పలువురు సూచించారు.
ఇదిలా ఉండగా, ఇటీవల ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సిఎం కెసిఆర్‌ను ఆహ్వానించారు. కెసిఆర్ అమరావతికి వెళ్లారు. ఇరువురు సీఎంలు శాంతిసామరస్యంగా ఉండటంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు కూడా.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications