Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నాలుగేళ్ళుగా ప్రేమలో ఉన్నాం, దేనికైనా సిద్దమే: జ్యోతి మృతిపై సందీప్ ఏమన్నాడంటే?

హైదరాబాద్: బ్యూటీషీయన్ జ్యోతి మృతిపై ఆమె ప్రియుడు సందీప్ నోరు విప్పాడు. మూడేళ్ళకుపైగా తామిద్దరం కూడ ప్రేమించుకొంటున్నామన్నారు. మా ఇద్దరి పెళ్ళికి రెండు కుటుంబాల సభ్యులు ఒప్పుకొన్నారని ఆయన చెప్పారు. జ్యోతి ఎలా మరణించిందనే విషయమై తేలాల్సిన అవసరం ఉందన్నారు.ఈ విషయమై తాను కూడ పోలీసులకు సహకరిస్తానని ఆయన చెప్పారు.జ్యోతి అనుమానాస్పదస్థితిలో సోమవారం నాడు మరణించిన విషయం తెలిసిందే.

రంగారెడ్డి జిల్లా తాండూరులోని అమ్మమ్మ ఇంటికి వెళ్ళేందుకు రైలులో ఆదివారం నాడు బయలుదేరిన జ్యోతి సోమవారం నాడు ఉదయం మైలారం రైల్వే స్టేషన్‌లో శవమై కన్పించింది. అయితే ఆమె ఎలా మరణించిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నాలుగేళ్ళుగా తాను జ్యోతి ప్రేమించుకొంటున్నట్టుగా సందీప్ చెప్పారు. సికింద్రాబాద్‌లోని ఓ హోటల్‌లో సందీప్ పనిచేస్తున్నారు. ఓ న్యూస్‌ఛానెల్‌తో సందీప్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో అనేక విషయాలను ఆయన ప్రస్తావించారు.

మా పెళ్ళికి రెండు కుటుంబాల నుండి ఓకే

మా పెళ్ళికి రెండు కుటుంబాల నుండి ఓకే

నాలుగేళ్ళుగా బ్యూటీషీయన్‌ జ్యోతితో తాను ప్రేమలో ఉన్నానని సందీప్ చెప్పారు.. తమ ప్రేమ విషయాన్ని ఇరు కుటుంబాల పెద్దలకు చెప్పామని, తాము పెళ్ళి చేసుకోవాలనే నిర్ణయానికి రెండు కుటుంబాల పెద్దలు కూడ అంగీకరించారని సందీప్ తెలిపారు.. తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని సందీప్ చెబుతున్నారు. త్వరలోనే పెళ్ళి చేసుకొందామని అనుకొన్నామని చెప్పారు. రెండు కుటుంబాలు కూడ ఇందుకు అంగీకరించారని ఆయన చెప్పారు.

జ్యోతితో రాత్రి మాట్లాడాను

జ్యోతితో రాత్రి మాట్లాడాను

బ్యూటీషీయన్ జ్యోతితో ఆదివారం రాత్రి ఏడు గంటల 50 నిమిషాల వరకు మాట్లాడానని సందీప్ చెప్పారు. ఆఫీసులో పర్మిషన్ తీసుకొని తాను ఊరెళ్తున్నానని జ్యోతి తనకు చెప్పిందన్నారు. ట్రైన్‌లో ప్రయాణం చేసే సమయంలో కూడ ఆమె తనతో ఫోన్‌లో మాట్లాడిందన్నారు.ప్యాసింజర్ ఎక్స్‌ప్రెస్ రైలులో వెళ్ళాలని తాను కోరానని చెప్పారు. కానీ, అప్పటికే ఆమె ప్యాసింజర్ రైలులో వెళ్ళిందన్నారు.

రోజులుగా జ్యోతిని కలవలేదు

రోజులుగా జ్యోతిని కలవలేదు

ప్రతి శని, ఆదివారాల్లో తాను జ్యోతి కలిసేవారమని చెప్పారు. వారాంతపు సెలవుల్లో జ్యోతి తన పిన్ని ఇంట్లో ఉండేదన్నారు. ఈ ఆదివారం కలవాలనుకొన్నామన్నారు. కానీ, ఈ ఆదివారం కూడ కలవాలనుకొన్నాం, కానీ, ఫంక్షన్ ఉన్న కారణంగా తాను ఊరికి వెళ్ళాలని జ్యోతి చెప్పిందన్నారు. అందుకే ఈ వారం తాను జ్యోతిని కలవలేదన్నారు.మరోవైపు మూడు రోజుల పాటు తాను జ్యోతిని కలవలేదన్నారు. ఫోన్‌లో మాత్రం జ్యోతితో మాట్లాడానని చెప్పారు. ప్రతి విషయాన్ని జ్యోతి తనతో షేర్ చేసుకొనేదని చెప్పారు.

 పోలీసులకు సహకరిస్తాం

పోలీసులకు సహకరిస్తాం

బ్యూటీషీయన్ జ్యోతి మృతి వెనుక తానున్నాననే ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఈ విషయమై తాను పోలీసులకు సహకరిస్తానని ఆయన చెప్పారు. అయితే తనతో ఇంతవరకు పోలీసులు ఎవరూ కూడ మాట్లాడలేదన్నారు. ఈ కేసు విషయమై పోలీసులకు సహకరిస్తానని ఆయన చెప్పారు. తాను తప్పు చేయలేదన్నారు. జ్యోతి ఎలా మరణించిందో తెలుసుకోవాలని తాను కూడ కోరుకొంటున్నానని ఆయన చెప్పారు.. రైల్వేస్టేషన్‌లోనే జ్యోతి మృతదేహన్ని చూశానని చెప్పారు. జ్యోతి కుటుంబసభ్యులకు తాను ఎలాంటి వాడినో తెలుసునని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+