వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆత్మాభిమానాన్ని చంపుకోలేదు, దండం పెట్టినవారే కాళ్ళు లాగారు: వెంకయ్య

హైదరాబాద్: ఎన్‌టిఆర్‌కు కాళ్ళకు దణ్ణం పెట్టినవారే , ఆ తర్వాతే ఆయనను కాళ్ళు పట్టి లాగారని ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వెంకయ్యనాయుడు చెప్పారు. తనకు బిజెపిలో గురుతుల్యులుగా ఉన్న వాజ్‌పేయి,

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఎన్‌టిఆర్‌కు కాళ్ళకు దణ్ణం పెట్టినవారే , ఆ తర్వాతే ఆయనను కాళ్ళు పట్టి లాగారని ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వెంకయ్యనాయుడు చెప్పారు. తనకు బిజెపిలో గురుతుల్యులుగా ఉన్న వాజ్‌పేయి, అద్వానీలకు కూడ ఏనాడూ కాళ్ళకు దణ్ణం పెట్టలేదని ఆయన చెప్పారు. ఈ తరహ పద్దతి సరికాదన్నారు. తాను ఏ పదవిలో ఉన్నా, ఎక్కడ పనిచేసినా ఆత్మగౌరవాన్ని మాత్రం వీడలేదన్నారు.2019 తర్వాత రాజకీయాల నుండి తప్పుకోవాలని భావించినట్టు చెప్పారు.

హైద్రాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో అలుపెరగని గళం- విరామమెరగని పయనం పుస్తకావిష్కరణ మంగళవారం జరిగింది.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు డాక్టర్ కోడెల శివప్రసాదరావు, మధుసూధనాచారి, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

తన జీవితం ఎలా ప్రారంభమైంది, అంచెలంచెలుగా ఎదిగిన వైనాన్ని ఆయన చెప్పారు. రాజకీయాల్లో తన కుటుంబసభ్యులను ఏనాడూ ప్రోత్సహించలేదని చెప్పారు. కొన్ని పద్దతులను తాను పాటిస్తానని చెప్పారు.

సుమారు 20 ఏళ్ళకు పైగా తన వెన్నంటి ఉన్న ఓఎస్‌డి సత్యకుమార్ సేవలను కూడ ఆయన కొనియాడారు. వెంకయ్యనాయుడు ప్రసంగాలు, కార్యక్రమాలకు సంబంధించి ఈ పుస్తకంలో ప్రచురించారు.

కాళ్ళకు దణ్ణం పెట్టే సంస్కృతి వద్దని ఎన్‌టిఆర్‌కు చెప్పాను.

కాళ్ళకు దణ్ణం పెట్టే సంస్కృతి వద్దని ఎన్‌టిఆర్‌కు చెప్పాను.

1983-84 కాలంలో గవర్నర్ రాంలాల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిడిపి ప్రభుత్వాన్ని రద్దుచేశారు. అయితే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎన్‌టిఆర్‌తో కలిసి పనిచేసిన విషయాన్ని ఆయన గుర్తుచేసుకొన్నారు. అయితే తిరిగి ఎన్‌టిఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన తర్వాత కూడ మంత్రివర్గంలో చేరాలని కూడ ఎన్‌టిఆర్ ఆహ్వనించారు. కానీ, తాను పార్టీమారే ప్రసక్తేలేదని తేల్చి చెప్పానన్నారు. కాళ్ళకు దణ్ణం పెట్టే సంస్కృతి తనకు నచ్చదన్నారు. ఈ విషయాన్ని ఎన్‌టిఆర్‌కు కూడ చెప్పానని ఆయన గుర్తుచేశారు. ఓ రోజు తెల్లవారుజామునే ఎన్‌టిఆర్ పిలిస్తే ఆయన ఇంటికి వెళ్ళాను, అయితే అప్పటికే ఆయన చుట్టూ కొందరున్నారని చెప్పారు. అయితే వారు తిరిగే వెళ్ళే సమయంలో ఎన్‌టిఆర్ కాళ్ళకు దణ్ణం పెట్టి మరీ వెళ్ళారని చెప్పారు. అయితే కాళ్ళకు దణ్ణం పెట్టే సంస్కృతి వద్దని ఎన్‌టిఆర్‌కు చెబితే గౌరవం అని ఎన్‌టిఆర్ చెప్పారన్నారు. అయితే ఆనాడు ఎన్‌టిఆర్ కాళ్ళకు మొక్కినవారే ఆయనను కాళ్ళు పట్టి లాగారని ఆయన చెప్పారు. రాజకీయాల్లో తనకు గురువులైన వాజ్‌పేయ్, అద్వానీ కాళ్ళు కూడ తాను ఏనాడూ మొక్కలేదన్నారు. ఆత్మాభిమానాన్ని ఏనాడూ చంపుకోలేదన్నారు.

Recommended Video

Uttar Pradesh CM Yogi Adityanath Resigns
 మర్రిచెన్నారెడ్డిని విమర్శిస్తే ఓపికగా వినేవారు

మర్రిచెన్నారెడ్డిని విమర్శిస్తే ఓపికగా వినేవారు

తాము అసెంబ్లీలో ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించే ప్రజావ్యతిరేక విధానాలపై అనర్గళంగా మాట్లాడేవారమన్నారు. తనతో పాటు జైపాల్‌రెడ్డి, సుందరయ్య, గౌతు లచ్చన్న వారితో కలిసి అసెంబ్లీలో ఉండడం కలిసి వచ్చిందన్నారు. మర్రిచెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రస్తుతం అవే విమర్శలు చేస్తే అసెంబ్లీ నుండి బయటకు వచ్చే పరిస్థితి ఉండేది కాదేమోనని ఆయన అభిప్రాయపడ్డారు. ఆనాడు అసెంబ్లీ వాయిదా పడడం అరుదు. ప్రస్తుతం వాయిదా పడడమే ఎక్కువ. అసెంబ్లీ నడవడమే తక్కువన్నారు.

జెండాలు కట్టాను, రిక్షాలో ప్రచారం చేశాను

జెండాలు కట్టాను, రిక్షాలో ప్రచారం చేశాను

పార్టీ కోసం తాను ఎలా పనిచేశానో ఆయన గుర్తుచేసుకొన్నారు. నెల్లూరులో వాజ్‌పేయ్ లేదా ఇతర బిజెపి నేతల ప్రచారానికి సంబంధించి రిక్షాలో ప్రచారం చేసినట్టు చెప్పారు. రిక్షా, ఆటో, జట్యాలో కూడ ప్రచారం చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. పార్టీ జెండాలను కట్టేందుకు స్థంబాలను ఎక్కానని చెప్పారు. పార్టీ నినాదాలను గోడలపై రాసినట్టు చెప్పారు. పార్టీ కోసం పనిచేశానని, అందుకే తనకు పదవులు వచ్చాయని చెప్పారు.

మంత్రి పదవి వద్దనుకొని పార్టీ పదవిని తీసుకొన్నా

మంత్రి పదవి వద్దనుకొని పార్టీ పదవిని తీసుకొన్నా

వాజ్‌పేయ్ మంత్రివర్గంలో బిజెపి సీనియర్ నేతలంతా మంత్రివర్గంలో చేరితే పార్టీ కార్యక్రమాలను ఎవరూ చూస్తారనే చర్చ సాగింది. అయితే ఈ ప్రశ్న వచ్చిన వెంటనే తాను పార్టీ బాధ్యతలను తీసుకొనేందుకు ముందుకు వచ్చినట్టు చెప్పారు. అయితే అనివార్య పరిస్థితుల్లో పార్టీ పదవి నుండి కేంద్రమంత్రివర్గంలోకి వాజ్‌పేయ్ తీసుకొన్నారని చెప్పారు. అయితే ఆనాడు తనకు డీమోషన్ ఇస్తున్నారా అంటూ వాజ్‌పేయ్‌ను అడిగినట్టు చెప్పారు.

ఎన్నికల్లో పోటీచేసిన సమయంలో వచ్చిన విరాళాలను పార్టీకి ఇచ్చాను

ఎన్నికల్లో పోటీచేసిన సమయంలో వచ్చిన విరాళాలను పార్టీకి ఇచ్చాను

ఉదయగిరి అసెంబ్లీ స్థానం నుండి రెండు దఫాలు పోటీచేసిన సమయంలోనూ విరాళాలు వచ్చాయన్నారు. అయితే ఈ సమయంలో వచ్చిన విరాళాలను ఎన్నికల్లో ఖర్చు చేయగా మిగిలితే ఎబివిపి, బిజెపి కార్యాలయాలకు పంపినట్టు చెప్పారు. అయితే ఆనాటి పరిస్థితులు ప్రస్తుతం లేవన్నారు. ఎన్నికల వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు.

2019 తర్వాత రాజకీయాలకు దూరంగా

2019 తర్వాత రాజకీయాలకు దూరంగా

2019 ఎన్నికల తర్వాత రాజకీయాలకు దూరంగా ఉండాలని భావించాను. అయితే అంతకుముందే రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితులు వచ్చాయని ఆయన చెప్పారు. అయితే రాజకీయాల్లో వారసత్వాన్ని దూరంగా ఉండాలని కోరుకొనే వ్యక్తిని. అందుకే తన కుటుంబసభ్యులెవరూ కూడ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని చెప్పారు. అయితే తాను రాజకీయాలకు దూరమైన తర్వాతే రాజకీయాల్లో చేరే విషయాలను ఆలోచించాలని కుటుంబసభ్యులకు కోరారని చెప్పారు.

English summary
Iam never encouraged my family members enter in to politics said vice president elect venkaiahnaidu. Venkaiahnaidu released book on Tuesday at Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X