Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Statue of Equality: ఘాటుగా విమర్శలు గుప్పించిన కేటీఆర్

హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్‌లో గల త్రిదండి చినజీయర్ స్వామి ఆశ్రమంలో నిర్మించిన రామానుజాచార్యులవారి విగ్రహావిష్కరణ కార్యక్రమం.. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలకు కేంద్రబిందువుగా మారేలా కనిపిస్తోంది. ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కేసీఆర్ ఆహ్వానించకపోవడం చర్చనీయాంశమైంది. జ్వరం వచ్చిందనే కారణంతో ప్రధాని పర్యటనకు దూరంగా ఉన్నారాయన.

అంతకుముందు రోజే వెళ్లొచ్చిన కేసీఆర్

అంతకుముందు రోజే వెళ్లొచ్చిన కేసీఆర్

రాష్ట్ర ప్రభుత్వం తరఫున- పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ఈ బాధ్యతలను అప్పగించారు. 216 అడుగుల ఎత్తు ఉన్న ఈ పంచలోహ విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చినజీయర్ స్వామివారి పర్యవేక్షణలో నిర్వహించిన యజ్ఞయాగాదుల్లో పాల్గొన్నారు. దీనికి కేసీఆర్ గైర్హాజర్ అయ్యారు. రామానుజుల సహస్రాబ్ది వేడుకలు ప్రారంభించిన రెండోరోజే కేసీఆర్ ఆశ్రమానికి వెళ్లిన విషయం తెలిసిందే.

హాట్ టాపిక్‌గా

హాట్ టాపిక్‌గా

ఏర్పాట్లన్నింటినీ ఆయన స్వయంగా పరిశీలించారు. ప్రధాని పర్యటనకు మాత్రం అందుబాటులో లేకుండాపోయారు. తేలికపాటి జ్వరం సోకినందున తాను ప్రధాని కార్యక్రమంలో పాల్గొనట్లేదని చెప్పారు. ఈ వ్యవహారం కాస్తా రాజకీయ రంగును పులుముకొంది. కేసీఆర్ ఉద్దేశపూరకంగా ప్రధాని పర్యటనకు దూరంగా ఉన్నారనే విమర్శలు చెలరేగాయి. భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకులు ఈ విషయం మీద కేసీఆర్‌ను టార్గెట్‌గా చేసుకున్నారు.

 బడ్జెట్ నాడు..

బడ్జెట్ నాడు..

కనీసం ప్రొటోకాల్‌ను కూడా పాటించలేదని, ప్రధానిని అవమానించారని ఆరోపిస్తోన్నారు. దీనికి కారణాలు లేకపోలేదు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఈ నెల 1వ తేదీన లోక్‌సభలో ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్‌పై కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఘాటు విమర్శలతో కేంద్ర ప్రభుత్వం చెలరేగిపోయారు. రెండుగంటల పాటు కొనసాగిన ప్రెస్ కాన్ఫరెన్స్.. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి పట్ల కేసీఆర్ వైఖరిని స్పష్టం చేసింది.

మోడీతో రాజకీయ విభేదాలు..

మోడీతో రాజకీయ విభేదాలు..

ఈ విభేదాల వల్లే కేసీఆర్- ప్రధాని పర్యటనకు దూరంగా ఉన్నారనే అభిప్రాయాలు రాష్ట్ర రాజకీయాల్లో వ్యక్తం అయ్యాయి. ఎన్డీఏ కూటమికి ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసే దిశగా ఆయన మరింత వేగంగా అడుగులు వేస్తోన్నారనే సంకేతాలను ఈ వ్యవహారం ఇచ్చిందనే వారూ లేకపోలేదు. మోడీ వ్యక్తిగత పర్యటన కావడం వల్ల ముఖ్యమంత్రి ఆయనకు స్వాగతం పలకాల్సిన అవసరం లేదని, దీనికి ప్రొటోకాల్ వర్తించబోదని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

కేటీఆర్ ట్వీట్..

మోడీ పర్యటనకు దూరంగా ఉండటం వల్ల జాతీయ స్థాయిలో ఉన్న ప్రతిపక్ష పార్టీలకు కేసీఆర్ ఓ బలమైన సందేశాన్ని పంపించినట్టవుతుందని టీఆర్ఎస్ అగ్ర నాయకత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ పరిణామాల మధ్య తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తాజాగా చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది

 స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీని హ్యాష్‌ట్యాగ్ చేస్తూ

స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీని హ్యాష్‌ట్యాగ్ చేస్తూ

స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీని హ్యాష్‌ట్యాగ్ చేస్తూ ఈ ట్వీట్ చేశారు కేటీఆర్. సమతామూర్తి విగ్రహాన్ని పక్షపాత వైఖరితో ఆవిష్కరించారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. సమానత్వాన్ని సాధించాలనే వేలాది ఆశలు, ఆశయాలు ఇప్పుడు మళ్లీ మరణించాయనే అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు. రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న అసమానత్వాన్ని దృష్టిలో ఉంచుకుని కేటీఆర్ ఈ కామెంట్స్ చేశారనే అభిప్రాయాలు ఉన్నాయి. తెలంగాణ పట్ల కేంద్రం చిన్నచూపు చూస్తోందంటూ టీఆర్ఎస్ నాయకులు ప్రధాని పర్యటన నాడు బ్యానర్లను సైతం ప్రదర్శించిన విషయం తెలిసిందే.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+