కుండపోత వర్షం, క్లౌడ్ బరస్ట్ - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరిక..!!
తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడన ఆవర్తనం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. తాజాగా వాతావరణ శాఖ ఏపీలోని పలు జిల్లాలతో పాటుగా హైదరాబాద్ నగరానికి భారీ వర్ష మప్పు ఉందని హెచ్చరించింది. ఏపీలోని పిలు జిల్లాలకు పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది. వాతావరణ శాఖ తాజా హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది.
మరోసారి హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. నగర వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం వాతావరణం పొడిగా ఉందని పేర్కొన్నారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అటు ఏపీలో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక జారీ అయింది. విజయ నగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాగా.. శ్రీకాకుళం, కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

తిరుపతి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కరుస్తాయని.. 40-50కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఇక, తెలంగాణలోని ఇక వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రాబోయే 2 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఈ జిల్లాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్ నగరంలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి నగరం అతలాకుతలమైంది. అత్యధికంగా షేక్‌పేటలో 10.6 సెం.మీ. వర్షపాతం నమోదు కాగా, శ్రీనగర్ కాలనీలో 10.0, ఖైరతాబాద్ సెస్ వద్ద 9.0, బంజారాహిల్స్ వెంకటేశ్వర కాలనీలో 8.2, మైత్రివనం 6.9, ముషీరాబాద్ జవహర్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద 6.3 సెం.మీ. వర్షపాతం నమోదైంది.












Click it and Unblock the Notifications