ఎన్నికల ఏడాది బీఆర్ఎస్ అనుకున్నదొకటి.. అయ్యిందొకటి!!

ఎన్నికల ఏడాది బిఆర్ఎస్ పార్టీకి ఊహించని తలనొప్పి వచ్చి పడింది. పేపర్ల లీకేజీ వ్యవహారంతో పర్యవసానం ఎలా ఉంటుందన్న ఆలోచనలో బీఆర్ఎస్ ఉంది.

ఎన్నికల ఏడాది బిఆర్ఎస్ పార్టీకి ఊహించని తలనొప్పి వచ్చి పడింది. గత కొంతకాలంగా ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంటే, వారికి మద్దతుగా ప్రతిపక్ష పార్టీలు కూడా రంగంలోకి దిగి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుంటే, ప్రతిపక్షాలకు చెక్ పెట్టి ఉద్యోగాల భర్తీ చేయాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు టీఎస్పీఎస్సీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనేక ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేస్తూ, పరీక్షలు నిర్వహిస్తూ నిరుద్యోగులలో ఉద్యోగాలపై చిరు ఆశలను మొలకెత్తించిన బిఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికలలో ఉద్యోగ నోటిఫికేషన్లతో యువత మద్దతు కూడా తమకే ఉంటుందని భావించింది. కానీ డ్యామిడ్ కథ అడ్డం తిరిగింది.

బీఆర్ఎస్ కు తలనొప్పిగా మారిన పేపర్ల లీకేజీ వ్యవహారం

బీఆర్ఎస్ కు తలనొప్పిగా మారిన పేపర్ల లీకేజీ వ్యవహారం

టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారం బీఆర్ఎస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా తయారైంది. బిఆర్ఎస్ పార్టీ అనుకున్నది ఒకటైతే అయింది మాత్రం వేరేగా ఉంది. ఒకపక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను ఈ డి విచారిస్తున్న నేపథ్యంలో ఇబ్బంది ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు టీఎస్పీఎస్సీ పేపర్లో లీకేజీ వ్యవహారం ప్రతిపక్షాలు కేటీఆర్ కు చుట్టడంతో మరో కొత్త సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. పేపర్ల లీకేజ్ వ్యవహారంలో కేటీఆర్ పోరాటం చేయాల్సి వస్తుంది. మరోవైపు గత అక్టోబర్ నుండి టీఎస్పీఎస్సీ నిర్వహించిన ఏడు పరీక్షల్లో నాలుగు పరీక్షలను రద్దు చేయడంతో నిరుద్యోగులు తీవ్ర అసహనంతో ఉన్నారు.

ప్రతిపక్షాల విమర్శలు .. నిరుద్యోగుల ఆగ్రహ జ్వాలలు

ప్రతిపక్షాల విమర్శలు .. నిరుద్యోగుల ఆగ్రహ జ్వాలలు

ఏళ్ల తరబడి ఎదురు చూస్తే పరీక్షలు పెట్టారు. ఎంతో కష్టపడి చదివి పరీక్షలు రాస్తే వాటిని పేపర్ లీకేజీ పేరుతో మళ్లీ రద్దు చేశారు. ఇలా అయితే ఎలా అంటూ నిరుద్యోగులు తీవ్ర అసహనంతో, ఆగ్రహంతో ఉన్నారు. ఇక ఇదే అదునుగా ప్రతిపక్షాలు మూకుమ్మడిగా యువతను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ వ్యవహారంలో వెనుక ఉంది కేటీఆర్ అని సంచలన ఆరోపణలు చేస్తూ బండి సంజయ్, రేవంత్ రెడ్డి కేటీఆర్ ను టార్గెట్ చేస్తున్నారు. కేటీఆర్ పిఏ తిరుపతి గురించి రేవంత్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. వాళ్ల ఊరి వాళ్ళ పేపర్లను మార్కులను బయటకు తీయాలని డిమాండ్ చేశారు.

సిట్ నోటీసులతో ప్రతిపక్షాల ఆరోపణలకు చెక్ పెట్టే యోచన

సిట్ నోటీసులతో ప్రతిపక్షాల ఆరోపణలకు చెక్ పెట్టే యోచన


ఇక బండి సంజయ్ కూడా బీఆర్ఎస్ నేతల పిల్లలకే ఎక్కువ మార్కులు వచ్చాయని ఆ లెక్కలు తీయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ప్రజాక్షేత్రంలో తిరుగుతూ సంచలన ఆరోపణలు చేస్తూ కేటీఆర్ ను టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీల ముఖ్య నాయకులకు సిట్ ద్వారా నోటీసులు జారీ చేసి వారి నోటికి తాళం వెయ్యాలని ప్రయత్నాలు చేస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వం. వారు చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని, ఆధారాలను చూపాలని ఇప్పటికే రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది సిట్.

ఎన్నికల ఏడాది బీఆర్ఎస్ కు కొత్త చిరాకు

ఎన్నికల ఏడాది బీఆర్ఎస్ కు కొత్త చిరాకు


ప్రతిపక్షాలు ఎవరైనా ఈ వ్యవహారంలో నోరెత్తి మాట్లాడితే, ఆరోపణలు చేస్తే ఆధారాలు ఇవ్వాలని సిట్ ద్వారా నోటీసులు పంపిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. మొత్తంగా చూస్తే ఇది బిఆర్ఎస్ పార్టీకి ఊహించని సమస్య. ఎన్నికల సంవత్సరం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి యువత ఓటు బ్యాంకును కొల్లగొట్టాలని, ప్రతిపక్షాలకు చెక్ పెట్టాలని ప్రయత్నం చేసిన బిఆర్ఎస్ కు పేపర్ల లీకేజీ వ్యవహారం ఊహించని చిరాకుకు కారణంగా మారింది. మరి ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ బయటపడుతుందా? మళ్లీ యువతకు బీఆర్ఎస్ ప్రభుత్వం పైన నమ్మకం కలిగిస్తుందా? అనేది వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+