మునిగిన 50 అపార్ట్‌మెంట్లు, తాళ్ల సాయంతో పాలు, నీళ్లు: వారివల్లేనని తలసాని

హైదరాబాద్: హైదరాబాదులో కురిసిన భారీ వర్షాల పైన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం నాడు స్పందించారు. చరిత్రలో ఇటీవలి కాలంలో ఎన్నడు కురవని వర్షాలు ఇప్పుడు కురిశాయ్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే ఇప్పుడు నగరంలో ఈ దుస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు.

పెరిగిన జనాభా, నాళాల ఆక్రమణ కూడా ఈ దుస్థితికి మరో కారణమని చెప్పారు. నాళాలను బాగు చేసేందుకు రూ.11వేల కోట్లు అవసరమని చెప్పారు. దశలవారిగా అన్నింటిని అభివృద్ధి చేస్తామన్నారు. ఎన్టీఆర్ మార్గ్‌లో కుంగిన ప్రాంతాన్ని తలసాని వాటర్ బోర్డు ఎండీతో కలిసి పరిశీలించారు.

నీట మునిగిన వాహనాలు

నగరంలో మంగళవారం సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కూకట్‌పల్లి, నిజాంపేట, కుత్భుల్లాపూర్, జగద్గిరిగుట్ట ప్రాంతాల్లో భారీ వర్షానికి పలు అపార్టుమెంట్లు జలదిగ్బంధమయ్యాయి.

Incessant rain throws life out of gear in Hyderabad

నిజాంపేట్ గ్రామపంచాయితీ పరిధిలోని బండారి లేఅవుట్‌లో దాదాపు 200 అపార్టుమెంట్లు ఉండగా సుమారు 50 అపార్టుమెంట్లు వర్షపు నీటిలో చిక్కుకున్నాయి. అపార్టుమెంట్ల సెల్లార్లు అన్నీ పూర్తిగా నీట మునిగిపోయాయి.

అపార్టుమెంట్ల నుంచి బయటకు రాలేక ఇబ్బంది

సెల్లార్‌లలో పార్కింగ్‌ చేసిన 200 పైగా కార్లు, చాలా బైకులు పెద్ద ఎత్తున ద్విచక్ర వాహనాలు నీటి మునిగిపోయాయి. రాత్రి తొమ్మిది గంటల నుంచి విద్యుత్ సరఫరా లేకపోవడంతో అపార్టుమెంట్లు చీకట్లో ఉండి పోయాయి. దీంతో అపార్ట్‌‌మెంట్ల్ నుంచి జనం బయటకు రాలేకపోయారు.

రహదారులన్ని పూర్తిగా నీటితో నిండిపోయాయి. బయట నుంచి పలువురు అపార్టుమెంట్లలో ఉన్న‌వారికి తాళ్ల సహాయంతో పాల ప్యాకెట్లు, మంచినీటి ప్యాకెట్లు ఇతర నిత్యవసర సరుకులు పైకి అందిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+