తప్పిన పెను ప్రమాదం: శంషాబాద్‌లో 15 ని.లపాటు ఇండిగో విమానం చక్కర్లు, ఎమర్జెన్సీ ల్యాండింగ్
హైదరాబాద్: మరో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. శంషాబాద్ నుంచి టేకాఫ్ తీసుకున్న కొద్ది నిమిషాలకే విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఢిల్లీకి వెళ్లాల్సిన ఆ విమానం 15 నిమిషాలపాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది.
అయితే, సమస్యను పసిగట్టిన ఫైలెట్ ఎమర్జెన్సీ ల్యాండిగ్‌కు అనుమతి తీసుకొని శంషాబాద్ ఎయిర్‌పోర్టులోనే విమానాన్ని ల్యాండ్ చేశారు. ఈ సమయంలో విమానంలో 165 మంది ప్రయాణికులు ఉన్నారు.
గత కొంతకాలంగా ఇండిగో ఫ్లైట్లు సాంకేతిక సమస్యలతో సతమతమౌతున్నాయి. సరిగ్గా రెండు రోజల క్రితమే శంషాబాద్ ఎయిర్‌పోర్టులోనే ఇదే కంపెనీకి చెందిన విమానం టైర్లు పేలిపోయి మంటలు చెలరేగాయి.

అదృష్టవశాత్తూ పెనుప్రమాదం తప్పింది. కాగా, ఈ విమానంలోనే వందమందికిపైగా ప్రయాణికులతోపాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా కూడా ఉన్నారు.
ఈ సంఘటన మరిచిపోక ముందే ఇండిగోకే చెందిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో వీటిలో ప్రయాణించాలంటే ప్రయాణికులు భయంతో వణికిపోతున్నారు. ఇండిగో ప్రయాణం అంటే ప్రాణానికి భరోసా లేదంటూ మండిపడుతున్నారు.
-
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications