గేట్లు ఎత్తివేత- శ్రీశైలానికి భారీ వరద
Srisailam Dam: కర్ణాటక సహా ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాల వల్ల కృష్ణానది జలకళను సంతరించుకుంది. వరదనీటితో పోటెత్తుతోంది. భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఫలితంగా జోగుళాంబ గద్వాల జిల్లాలోని ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. గరిష్ఠస్థాయి నీటిమట్టాన్ని అందుకుంది.
దీనితో 10 గేట్లను ఎత్తివేశారు అధికారులు. వరద నీటిని దిగువకు వదులుతున్నారు. దీని ప్రభావం నంద్యాల జిల్లా శ్రీశైలం రిజర్వాయర్ పై భారీగా పడుతోంది. శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. ఈ భారీ రిజర్వాయర్ నీటిమట్టం క్రమంగా పెరుగుతూ వస్తోంది.

మహారాష్ట్ర, కర్ణాటకల్లో కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తోన్న విషయం తెలిసిందే. దీని ప్రభావంతో అటు గోదావరి, ఇటు కృష్ణానదికి వరద పోటుకు గురయ్యాయి. భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. కృష్ణా ఉపనదులు ఘటప్రభ, మలప్రభ, భీమా, తుంగ, భద్ర సైతం పొంగిపొర్లుతున్నాయి.
కర్ణాటకలోని ఉత్తర కన్నడ, బెళగావి, హవేరి, విజయపురా, బాగల్‌కోటె, కలబురగి, బళ్లారి.. వంటి జిల్లాల్లో అతి భారీగా వర్షాలు కురిశాయి. ఆయా ప్రాంతాలన్నీ కూడా కృష్ణా బేసిన్ పరిధిలోకి వచ్చేవే. అటు మహారాష్ట్రలోనూ కృష్ణా ఎగువ పరీవాహక ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షాలు పడుతున్నాయి.
ఫలితంగా కృష్ణానది ఉరకలేస్తోంది. కర్ణాటకలో దీనిపై నిర్మించిన ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి. ఆలమట్టి, నారాయణ్‌పూర్ ప్రాజెక్టులు గరిష్ఠ నీటి మట్టానికి చేరుకున్నాయి. దీనితో కొద్ది రోజుల కిందటే వాటి గేట్లను ఎత్తివేశారు కర్ణాటక జలవనరుల అధికారులు. లక్షకు పైగా క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
దీని ప్రభావం తెలంగాణపై పడింది. జూరాల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు చేరుకుంటోంది. శుక్రవారం జూరాల ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి దిగువకు 58,722 క్యూసెక్కు నీటిని విడుదల చేస్తోన్నారు. అల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి జూరాలకు 84,000 క్యూసెక్కుల వదర నీరు వచ్చి చేరుతున్నది.
జూరాలకు వరద కొనసాగుతుండగా విద్యుత్ ఉత్పత్తికి 31,852 క్యూసెక్కులు, భీమా ఫేజ్ 1కు 650, కోయిల్‌సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ కు 315, కుడి కాల్వకు 340 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 84,000 క్యూసెక్కులు ఉండగా మొత్తం అవుట్ ఫ్లో 91,944గా నమోదైంది. జూరాల పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 7,681 టీఎంసీల నీరు నిలువ ఉన్నది.
ఈ వరద ప్రవాహం శ్రీశైలం రిజర్వాయర్ కు వచ్చి చేరుతోంది. క్రమంగా నిండుతోందీ డ్యామ్. గరిష్ఠ స్థాయి నీటి మట్టానికి చేరువ అవుతోంది. ఇదే ప్రవాహం ఇంకొన్ని రోజుల పాటు కొనసాగితే.. రిజర్వాయర్ పూర్తిస్థాయిలో నిండిపోతుందని జల వనరుల మంత్రిత్వ శాఖ అధికారులు అంచనావేశారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications