కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై తనిఖీలు షురూ: సిట్టింగ్ జడ్జీతో విచారణకు హైకోర్టు సీజేకి లేఖ
కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై రాష్ట్రప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మేడిగడ్డ పిల్లర్లు కుంగడంపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తూ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy)ఉత్తర్వులు జారీ చేశారు. పది నీటిపారుదల కార్యాలయాల్లో విజిలెన్స్ తనిఖీలు చేయాలని ఆదేశించారు. మేడిగడ్డ నుంచి హైదరాబాద్ వరకు కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహిస్తామన్నారు.
మేడిగడ్డ ఘటనపై సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణపై కేబినెట్‌లోనూ తీర్మానం చేశామని తెలిపారు. సిట్టింగ్ జడ్జితో విచారణ కోసం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశామని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై పూర్తి సమాచారంతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను అధికారుల ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. మరోవైపు మంగళవారం ఉదయం నుంచి కాళేశ్వరం, మేడిగడ్డకు సంబంధిచి రాష్ట్ర వ్యాప్తంగా 12 చోట్ల విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సోదాలు చేస్తున్నారు.

ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, కన్నెపల్లి, సిరిపురం, గోలివాడ పంపు హౌజ్‌లకు సంబంధించిన రికార్డులను పరిశీలించేందుకు విజిలెన్స్ బృందాలు తనిఖీలు కొనసాగిస్తున్నాయి. ప్రాజెక్టు పరిధిలో 10 బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులను కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కోసం ప్రత్యేకంగా నియమించినట్లు సమాచారం.
మరోవైపు, మేడిగడ్డ బ్యారేజీ కుంగిన నేపథ్యంలో హైదరాబాద్ ఎర్రమంజిల్ జలసౌధలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. కాళేశ్వరం కార్పొరేషన్ కార్యాలయంలోని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, క్వాలిటీ కంట్రోల్ విభాగాల కార్యాలయాల్లో పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలపై దృష్టి సారిస్తూ తనిఖీలు చేపట్టినట్లుగా సమాచారం.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రామగుండం, మహదేవపూర్, మేడిగడ్డ, ఎల్ఎండీతో పాటు ప్రాజెక్టకు సంబంధించిన ప్రత్యేక కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలోని ఈఎన్సీ, ఎస్ఈ, క్వాలిటీ కంట్రోల్ కార్యాలయాల్లోనూ బృందాలు రికార్డులను పరిశీలించాయి. పలు ఫైళ్లను స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స్ అదనపు ఎస్పీ బాలకోటయ్య తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ, కన్నేపల్లి పంప్ హౌస్‌లకు సంబంధించిన కార్యాలయాల్లో అధికారుల బృందాలు ముమ్మర తనిఖీలు నిర్వహించాయి.
మహాదేవపూర్ సాగునీటి శాఖ డివిజన్ కార్యాలయం, కన్నేపల్లి పంప్ హౌస్ కార్యాలయాల్లో రికార్డులను విలువైన పత్రాలను అధికారుల బృందాలు పరిశీలించి వాటిని స్వాధీనం చేసుకున్నాయి. మంగళవరాం ఉదయం 9 గంటల నుంచి మహదేవ్ పూర్, కన్నపెల్లి పంప్ హౌజ్ కార్యాలయల్లో సోదాలు నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయని రూ.లక్ష కోట్ల మేర కుంభకోణం జరిగిందని మొదటి నుంచి ఆరోపిస్తున్న కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రాజెక్టుపై సమగ్రంగా సమీక్ష చేపట్టింది. తాజాగా అక్రమాలను నిగ్గుతేల్చేందుకు ముమ్మరంగా సోదాలు, తనిఖీలు చేయిస్తోంది. అంతేగాక, హైకోర్టు సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించేందుకు ప్రభుత్వం హైకోర్టు సీజేకు లేఖ కూడా రాసింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications