వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్ లో నిబంధనలు పాటించని ఆ ప్రముఖ కాలేజీలు బంద్ !! రెడీ అవుతున్న ఇంటర్ బోర్డ్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌లోని గుర్తింపు లేని కళాశాలలను మూసివెయ్యాలని నిర్ణయం తీసుకుంది ఇంటర్ బోర్డు . ప్రధానంగా శ్రీ చైతన్య, నారాయణ జూనియర్ కాలేజీలకు తెలంగాణ ఇంటర్ బోర్డు త్వరలో షాక్ ఇవ్వనుంది . అగ్నిమాపక శాఖ అనుమతులు లేని కాలేజీలను , ఇరుకు భవనాల్లో కాలేజీలు నిర్వహిస్తూ నిబంధనలను పాటించని, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కాలేజీలను మూసివెయ్యాలని నిర్ణయం తీసుకుంది .అనుమతుల్లేని కాలేజీలను మూసి వేసేందుకు అనుమతించాలని కోర్టుకు నివేదించింది ఇంటర్ బోర్డు.

తెలంగాణలో గుర్తింపులేని కాలేజీలపై కొరడా .. 79 ఇంటర్ కళాశాలలకు నోటీసులు జారీతెలంగాణలో గుర్తింపులేని కాలేజీలపై కొరడా .. 79 ఇంటర్ కళాశాలలకు నోటీసులు జారీ

 గుర్తింపులేని 79 కళాశాలలకు నోటీసులిచ్చిన ఇంటర్ బోర్డ్

గుర్తింపులేని 79 కళాశాలలకు నోటీసులిచ్చిన ఇంటర్ బోర్డ్

తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపులేని 79 కళాశాలలను గుర్తించి నోటీసులు ఇచ్చిన ఇంటర్ బోర్డు ఈ నెల 22న నోటీసులు జారీ చేసి మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది . కాలేజీల యాజమాన్యాల నుంచి స్పందన రాకుంటే వాటిని మూసివేస్తామని హెచ్చరించింది . కచ్చితంగా అనుమతులు తీసుకుని, నిబంధలన ప్రకారం కళాశాలలు నడిపించాలని లేదంటే కచ్చితంగా కళాశాలలు మూసివేస్తామని హెచ్చరించిన ఇంటర్ బోర్డ్ ఇక ఇదే విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకువచ్చింది.

 విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు ముందు ఇబ్బంది పడతారని కోర్టుకు చెప్పిన బోర్డు

విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు ముందు ఇబ్బంది పడతారని కోర్టుకు చెప్పిన బోర్డు

అయితే ఇప్పటికిప్పుడు మూసివేస్తే సుమారు 29 వేల 808 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షల ముందు ఇబ్బంది పడతారని పేర్కొంది . అందుకే ఇంటర్ పరీక్షలు ముగిసిన వెంటనే శ్రీ చైతన్య, నారాయణ కాలేజీల మూసివేతకు అనుమతించాలని ఇంటర్ బోర్డు తెలంగాణ హైకోర్టును కోరింది.సామాజిక కార్యకర్త రాజేష్ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపిన నేపధ్యంలో ఇంటర్ బోర్డు ఈ అఫిడవిట్ దాఖలు చేసింది .

గుర్తింపులేని నారాయణ, శ్రీచైతన్య కళాశాలలపై హైకోర్టులో ముగిసిన విచారణ

గుర్తింపులేని నారాయణ, శ్రీచైతన్య కళాశాలలపై హైకోర్టులో ముగిసిన విచారణ


ఇక గుర్తింపులేని నారాయణ, శ్రీచైతన్య కళాశాలలపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. గుర్తింపులేని కళాశాలలపై హైకోర్టుకు నివేదిక సమర్పించిన ఇంటర్ బోర్డు అగ్నిమాపక శాఖ ఎన్ఓసీ లేని కాలేజీలకు షోకాజ్ నోటీసులిచ్చామని మార్చి 4వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలున్నందున ఇప్పటికిప్పుడు కాలేజీలు మూసివేస్తే విద్యార్థులు ఇబ్బంది పడతారని కోర్టు దృష్టికి తీసుకెళ్ళింది.

Recommended Video

Telangana Telugu Mahila Chief Tirunagari Jyothsna Speaks To Oneindia Telugu
అనుమతులు లేని, నిబంధనలు పాటించని ప్రముఖ కాలేజీలపై ఉక్కు పాదం

అనుమతులు లేని, నిబంధనలు పాటించని ప్రముఖ కాలేజీలపై ఉక్కు పాదం


పరీక్షలు ముగిసిన వెంటనే కాలేజీలను మూసివేసేందుకు అనుమతించాలని ఇంటర్ బోర్డు హైకోర్టును కోరింది. అగ్నిమాపక ఎన్ఓసీ లేని కాలేజీల్లోనూ పరీక్షా కేంద్రాలున్నాయని ఇంటర్ బోర్డు తెలిపింది. దాంతో తగిన చర్యలు తీసుకొని ఏప్రిల్ 3వ తేదీన నివేదిక సమర్పించాలని హైకోర్టు తెలంగాణ ఇంటర్ బోర్డును ఆదేశించింది. హైకోర్టు అనుమతులు లేని కాలేజీలపై చర్యలు తీసుకోమని చెప్పిందని గతంలోనే చెప్పిన ఇంటర్ బోర్డ్, అనుమతులు లేని, నిబంధనలు పాటించని ప్రముఖ కాలేజీలపై ఉక్కు పాదం మోపటానికి రంగం సిద్ధం చేసుకుంది.

English summary
The Inter Board has decided to close the unrecognized colleges in Hyderabad. Telangana Inter Board will soon be a shock to mainly Sri Chaitanya and Narayana Junior Colleges. The fire department has decided to close down unauthorized colleges, colleges in narrow buildings, and non-compliance with the rules .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X