ఇంటర్ పరీక్ష బాగా రాయలేదని కాలేజ్ హాస్టల్ లో విద్యార్థిని ఆత్మహత్య

ఇంటర్ పరీక్ష బాగా రాయలేదని కాలేజ్ హాస్టల్ లో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన ఘటన హన్మకొండ జిల్లాలో చోటు చేసుకుంది.

వరంగల్: ఇంటర్ పరీక్షలు కొనసాగుతుండగానే ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుంది. నిన్న ఇంటర్ పరీక్షకు హాజరైన విద్యార్థి ఈరోజు హాస్టల్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకుంది. పరీక్ష బాగా రాయలేదన్న కారణంతోనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు.

పరీక్ష బాగా రాయలేదని విద్యార్థిని ఆత్మహత్య

పరీక్ష బాగా రాయలేదని విద్యార్థిని ఆత్మహత్య


ఇక విద్యార్థిని ఆత్మహత్య ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే కొడకండ్ల మండలంలోని ఏడునూతల గ్రామానికి చెందిన విద్యార్థిని మురారి శెట్టి నాగజ్యోతి హన్మకొండ నగరంలోని సువిద్య జూనియర్ కళాశాల లో మొదటి సంవత్సరం చదువుతుంది. బుధవారం ప్రారంభమైన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష కు హాజరై పరీక్ష రాసి కళాశాల హాస్టల్ కు చేరుకుంది. ఆపై హాస్టల్ లో అంతా స్టడీ అవర్స్ లో ఉన్న సమయం చూసి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి

ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి


రాత్రి 9గంటలకు ఉరి వేసుకోగా, రూమ్ లోని వచ్చి చూసిన తోటి విద్యార్థినులు కళాశాల యాజమాన్యానికి సమాచారం అందించారు. వెంటనే కళాశాల యాజమాన్యం విద్యార్థినిని నగరంలోని లైఫ్ లైన్ హాస్పిటల్ కు ముందు చికిత్స కోసం తరలించారు.ఆ తర్వాత విద్యార్థి కండిషన్ సీరియస్ గా ఉండడంతో లైఫ్ లైన్ హాస్పిటల్ నుంచి ఎంజీఎం కు తీసుకెళ్లారు. ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతు విద్యార్థిని మురారి శెట్టి నాగజ్యోతి మృతి చెందింది. ఇక ఈ ఘటనతో విద్యార్థిని స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

క్షణికావేశంతో చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు

క్షణికావేశంతో చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు


పరీక్ష బాగా రాయలేదని ఫెయిల్ అవుతానన్న మనస్తాపంతో డిప్రెషన్ కి లోనై విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఇక పరీక్షలు రాసి తిరిగి ఇంటికి వస్తుందని అనుకున్న తమ కుమార్తె తిరిగిరాని లోకాలకు చేరిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం విద్యార్థిని మృతదేహాన్ని తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించారు. క్షణికావేశంతో చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు పెరిగిపోవడం ప్రస్తుతం సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తుంది.

పరీక్షలకు మానసికంగా విద్యార్థినులను సన్నద్ధం చెయ్యాలి

పరీక్షలకు మానసికంగా విద్యార్థినులను సన్నద్ధం చెయ్యాలి

ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా విద్యార్థులను మానసికంగా పరీక్షలకు సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉందన్న భావన వ్యక్తం అవుతుంది. ఏదేమైనా విద్యార్థులు పరీక్ష రాయలేదనో, అమ్మ తిట్టిందనో, పరీక్ష తప్పుతామనో చిన్న చిన్న కారణాలకు ఆత్మహత్యలకు పాల్పడడం మంచిది కాదని చెబుతున్నారు మానసిక నిపుణులు. క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అలవాటు చేసుకుంటే ఇబ్బందులు రావని, ఒకవేళ వచ్చినా వాటిని సమర్ధంగా ఎదుర్కోగలుగుతారని చెప్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+