మీరు నాపై దాడి చేస్తే: సరదాగా గవర్నర్, నన్ను వదలట్లేదని రేవంత్ కౌంటర్
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిల మధ్య బుధవారం నాడు ఆసక్తికరమైన చర్చ సాగింది. తెలంగాణ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిందని గవర్నర్‌కు ఫిర్యాదు చేసేందుకు టిడిపి నేతలు వెళ్లిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా ఆసక్తికర చర్య సాగినట్లుగా తెలుస్తోంది. రాజ్ భవన్‌లో జరిగే కార్యక్రమాలకు తమను ఆహ్వానించడం లేదని, తమ పార్టీని ప్రత్యేకంగా ఎన్నికల సంఘమే గుర్తింపునిచ్చిందని, మీరు మాత్రం గుర్తించడం లేదని తెలంగాణ టిడిపి నేతలు... గవర్నర్‌తో సరదాగా అన్నారు.

అయితే టీడీపీ నేతల పైననరసింహన్ కూడా సరదాగా స్పందిస్తూ.. మీరంతా వచ్చి నాపై దాడి చేస్తే నాకు రక్షణ ఎవరని.. రేవంత్ రెడ్డిని చూపించి చలోక్తి విసిరారని తెలుస్తోంది. దానికి రేవంత్ సరదాగా స్పందిస్తూ.. నాడు అసెంబ్లీలో ఘటనలో తనతో పాటు ఉన్న ముద్దాయిలను మీరే మంత్రులను చేశారని, నన్ను మాత్రం మీరు వదలడం లేదన్నారు.
కాగా, మల్లన్న సాగర్ నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం అమలు చేయడం లేదని, మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం సక్రమంగా లేదని గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి, ఎల్ రమణ తదితరులు ఉన్నారు.












Click it and Unblock the Notifications