సికింద్రాబాద్-అయోధ్య, ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్‌కు ఏపీలో హాల్ట్ స్టేషన్లు ఇవే
Secunderabad-Ayodhya express: ఈ నెల 26వ తేదీన మహా శివరాత్రి. ఈ పర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని శైవక్షేత్రాలు భక్తులతో పోటెత్తుతుంటాయి. భక్తుల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ మరో ప్యాకేజీని ప్రకటించింది. అయోధ్య- కాశీ పుణ్యక్షేత్ర యాత్ర, జ్యోతిర్లింగ దర్శనం ప్యాకేజీని ప్రకటించింది.
భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ ద్వారా ఆయా పుణ్యక్షేత్రాలను భక్తులు దర్శించుకోవచ్చు. ఎనిమిది రాత్రులు/తొమ్మిది పగళ్లు సాగే యాత్ర ఇది. ఈ నెల 28వ తేదీన సికింద్రాబాద్ నుంచి భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ బయలుదేరి వెళ్తుంది. మొత్తం 718 సీట్లు అందుబాటులో ఉంటాయి. ఇందులో స్లీపర్- 460, 3ఏసీ- 206, 2ఏసీ- 52.

సికింద్రాబాద్ నుంచి బయలుదేరి ఖాజీపేట్, వరంగల్, ఖమ్మం, ఏపీలోని విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం, పలాస, ఒడిశాలోని బ్రహ్మపూర్, ఖుర్దారోడ్, భవనేశ్వర్, కటక్, భద్రక్, బాలేశ్వర్ స్టేషన్‌లల్లో ఈ ఎక్స్‌ప్రెస్‌కు హాల్ట్ సౌకర్యం ఉంది.
ఈ ప్యాకేజీలో గయ- వారణాశి- అయోధ్య- ప్రయాగ్ రాజ్ ఉన్నాయి. గయలో విష్ణుపాద ఆలయం, వారణాశిలో కాశీ విశ్వనాథుడు, అక్కడి కారిడార్, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణ దేవి ఆలయాలను సందర్శించవచ్చు. అయోధ్యలో శ్రీరామచంద్రులవారి ఆలయం, హనుమాన్ గర్హి, హారతి, అత్యంత ప్రాచీనమైన సరయూ నదిని దర్శించవచ్చు.
ప్రయాగ్ రాజ్‌లో త్రివేణి సంగమంలో మహా కుంభమేళా పుణ్యస్నానాలను ఆచరించడంతో ఈ ప్యాకేజీ టూర్ ముగుస్తుంది. ప్రయాగ్ రాజ్ నుంచి మళ్లీ సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్.
ఈ ప్యాకేజీ కోసం ఒక్కొక్కరు చెల్లించాల్సిన ఛార్జీ మొత్తం 14,390 రూపాయలు. ఇది ఎకానమీ అంటే స్లీపర్ క్లాస్. ఇందులో పిల్లలు అంటే 5 నుంచి 11 సంవత్సరాల్లోపు వారికి 13,495 రూపాయల ఛార్జీని నిర్ధారించారు. థర్డ్ ఏసీలో పెద్దలకు 23,600, పిల్లలకు 22,550 రూపాయలు, సెకెండ్ ఏసీ పెద్దలకు 31,160, పిల్లలకు 29,990 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది.
దేశంలో ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలను అనుసంధానిస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ.. భారత్ గౌరవ్ పేరుతో ఈ ప్రత్యేక రైళ్లను నడిపిస్తోన్న విషయం తెలిసిందే. వీటికి ప్రయాణికుల నుంచి అద్భుత స్పందన లభిస్తోంది. ప్రారంభమైన అన్ని చోట్ల కూడా ప్రయాణికుల ఆదరణ భారీగా ఉంటోంది. వాటి ట్రిప్‌ల సంఖ్యను పెంచుతోంది












Click it and Unblock the Notifications