షాకింగ్: కోదండరాంకు బీజేపీ అంత పెద్ద ఆఫరిస్తే తిరస్కరించారా?
తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంకు భారతీయ జనతా పార్టీ భారీ ఆఫర్ వచ్చినట్లు తెలిసింది. ఏకంగా గవర్నర్ పదవి ఇస్తామని బీజేపీ ఆఫర్ చేసిందట. అయితే, కోదండరాం మాత్రం అందుకు పెద్దగా ఆసక్తి చూపలే
హైదరాబాద్: తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంకు భారతీయ జనతా పార్టీ భారీ ఆఫర్ వచ్చినట్లు తెలిసింది. ఏకంగా గవర్నర్ పదవి ఇస్తామని బీజేపీ ఆఫర్ చేసిందట. అయితే, కోదండరాం మాత్రం అందుకు పెద్దగా ఆసక్తి చూపలేదని తెలిసింది.
కేంద్రంలో ఉన్నది తమ ప్రభుత్వమేనని, గవర్నర్ పదవిని ఇప్పిస్తామని, తీసుకోవాలని బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్ రెడ్డి స్వయంగా కోదండరాంకు ఆఫర్ చేసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది.

బీజేపీ ఆఫర్‌కు కృతజ్ఞతలు చెప్పిన కోదండరాం.. తనకు అటువంటి ఆలోచన లేదని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయడమే తన ముందున్న కర్తవ్యమని స్పష్టం చేసినట్టు సమాచారం. ఉద్యమాలు తప్ప మరో ఆలోచన లేదని ఈ సందర్భంగా కిషన్ రెడ్డితో కోదండరాం అన్నారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.












Click it and Unblock the Notifications