తహసీల్దారా..? అడ్డ గాడిదా..? వ్రుద్ద దంపతులతో బిక్షమెత్తించిన వైనం..!!
భూపాల పల్లి/ హైదరాబాద్ : వారిది క్రిష్ణా రామా అనుకుంటూ మనవళ్లతో కాలక్షేపం చేసే వయసు. ఐన వాళ్లను ,బందుబలగాన్ని చూసి త్రుప్తిగా ఆనందించాల్సిన వయసు. కాని వారి వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా ఓ కక్కుర్తి అదికారి వారు బిచ్చమెత్తుకోవడానికి కారణం అయ్యాడు. విషయం తెలుసుకున్న స్థానికులు అన్నం తింటున్నాడా బియ్యం తింటున్నాడా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. తహసీల్దారుకు లంచం ఇచ్చేందుకు సాయం చేయాలంటూ ఇద్దరు వృద్ధ దంపతులు బిచ్చమెత్తిన ఘటన ఇది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం ఆజంనగర్‌కు చెందిన మాంత బసవయ్య, లక్ష్మి అనే వృద్ధ దంపతులు తమ పట్టా భూములకు పాసు పుస్తకాలు ఇచ్చేందుకు తహసీల్దారు లంచం అడుగుతున్నారని జిల్లా కేంద్రంలో భిక్షాటన చేశారు. ఈ విషయం జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించగా, సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు తక్షణం స్పందించి ఆర్డీవో ద్వారా సమస్య పరిష్కరించారు.

ఇదే మాట కొద్ది రోజుల ముందుగా చెబితే వ్రుద్ద జంటకు బిక్షాటన చేసే ఖర్మ తన్నేదని పలువురు చెవులు కొరుక్కున్నట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications