హైదరాబాద్‌పై ఐసిస్ చీఫ్ కన్ను: ఎవరెవరికి ఏయే బాధ్యతలు?
హైదరాబాద్: ఉగ్రవాద చర్యలతో ప్రపంచాన్ని వణిికిస్తున్న ఐఎస్ఐఎస్ సంస్థ చీఫ్ అబు బాకర్ అల్ బగ్ధాదీ కన్ను హైదరాబాదుపై పడినట్లు తెలుస్తోంది. నగరంలో భారీ విధ్వంసానికి కుట్ర చేసిన బగ్దాదీ హైదరాబాదులోని సానుభూతిపరులతో మాట్లాడుతూ వారికి పథక రచన గురించి వివరించినట్లు తెలుస్తోంది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ)కు చిక్కిన యువకులతో అతను స్వయంగా మాట్లాడినట్లు తెలుస్తోంది.
అందుకు సంబంధించి ఎన్‌ఐఏ అధికారులకు కీలక సమాచారం దొరికింది. ఎన్‌ఐఏ కస్టడీలోనున్న మహ్మద్ ఇబ్రహీం, హాబీబ్ మహ్మద్, ఇలియాస్ యజ్దానీ, అబ్దుల్లా బిన్ అహ్మద్ అమూదీ, ముజఫర్ హూస్సేన్ రిజ్వాన్ విచారణలో దిగ్భాంతికరమైన విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది.
వారితో ఐఎస్ చీఫ్ బగ్దాదీ నాలుగుసార్లు ఆన్‌లైన్‌లో మాట్లాడినట్లు తెలిసింది. ఇస్లామిక్ స్టేట్ స్థాపనకు ప్రతిజ్ఞ చేసిన ఐదుగురు యువకులు తమ వీడియోలను కూడా ఆన్‌లైన్ చాటింగ్‌లో ఐఎస్ చీఫ్‌కు పంపినట్లు తెలుస్తోంది. విచారణలో మరికొన్ని వివరాలు తెలియడంతో మూడు ఎన్‌ఐఏ ప్రత్యేక బృందాలు మంగళవారం హైదరాబాద్‌లోని బార్కాస్, తలాబ్‌కట్ట ప్రాంతాల్లో మంగళవారంనాడు సోదాలు జరిపాయి.
తలాబ్‌కట్టలోని ఇబ్రహీం ఇంటి నుంచి ఐసిస్ నేతలతో ఆన్‌లైన్ సంభాషణకు ఉపయోగించినట్లు అనుమానిస్తున్న కంప్యూటర్, స్కానర్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బార్కాస్‌లోని హబీబ్ ఇంట్లో సోదాలు జరిపి రహస్యప్రాంతంలో దాచిపెట్టిన 9ఎంఎం పిస్టల్‌కు సంబంధించిన 17 తూటాలను స్వాధీనం చేసుకున్నారు.
భవానీనగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని షాలిమార్ ఆన్‌లైన్ సేవా కేంద్రంలోనూ తనిఖీలు చేశారు. కస్టడీలో ఉన్న నిందితులు తాము ఇస్లామిక్ స్టేట్ స్థాపనకు చేసిన ప్రతిజ్ఞకు సంబంధించి వీడియోలు, ఆన్‌లైన్‌లో సంభాషణలు ఈ కేంద్రం నుంచే అప్‌లోడ్ చేశామని చెప్పినట్లు తెలుస్తోంది.
దాంతో అధికారులు కంప్యూటర్, స్కానర్‌ను స్వాధీనం చేసుకున్నారు. విధ్వంసాలకు కుట్రపన్నిన ఈ అనుమానితులు తమకుతాము అరబిక్‌లో గౌరవప్రదమైన కున్యా పేరును పెట్టుకున్నారు. రిజ్వాన్: అబు హాసన్, ఇబ్రహీం యజ్దానీ: అబు అబ్దుర్ రహ్మాన్, ఇలియాస్ యజ్దానీ: అబు మన్సూర్, హబీబ్: అబు షాహీబా, ఫహాద్: అబు హలీమా. వారు ఐఎస్ అపరేషన్‌లో పని చేస్తున్న సమయంలో ఈ పేరుతో పిలుచుకునే వారని విచారణలో వెల్లడైంది.
ఇలా బాధ్యతల పంపకం...
ఇబ్రహీం యజ్దానీ (కమ్యూనికేషన్ ఇన్‌చార్జి): పేలుళ్లకు సంబంధించిన విధి నిర్వహణ బాధ్యతలకు రా...బిట్ పేరును కోడ్ భాషగా పెట్టుకున్నాడు. అతడు తన అనుచరులతో నిత్యం సమాచారాన్ని సేకరిస్తూ ఎవరు ఏ బాధ్యతలు నిర్వహించాలి? ఏ సమయంలో ఎక్కడ కలువాలి? అపరేషన్ ఎలా అమలు చేయాలి? అనే అంశాలను తన బృందానికి తెలియజేసే పనిని నిర్వహించాడు.
ఇలియాస్ యజ్దానీ: మతపరమైన అంశాలను పరిశీలిస్తూ వాటి వివరాలను ఎప్పటికప్పుడు టీమ్ సభ్యులకు చేరవేశాడు.
రిజ్వాన్ (మహాసిబ్): మహాసిబ్ అంటే అకౌంటెంట్. అరబ్ దేశాల నుంచి వచ్చిన నిధుల లెక్కలను చూస్తూ వాటి వివరాలను టీమ్ సభ్యులకు వివరించేవాడు.
హబీబ్ మహ్మద్ (అస్కారీ):విధ్వంసాలకు కావాల్సిన పేలుడు పదార్థాలు, ఆయుధాలు సమకూర్చుకోవడం వంటి వ్యవహరాలను చూశాడు.
హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్రపన్నిన వీరు తాము నిర్వహిస్తున్న బాధ్యతలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పడు ఆన్‌లైన్‌లో సిరియాలోనున్న వీరి ఇన్‌చార్జికి చేరవేసినట్లు నిందితులు విచారణలో తెలిపినట్లు సమాచారం. ఇప్పటికే ఈ నిందితుల వద్ద దొరికిన పేలుడు పదార్థాలు, 6 ల్యాప్‌టాప్‌లు, 40 మొబైల్ ఫోన్‌లు, 32 సిమ్‌కార్డులు, పెన్‌డ్రైవ్‌లు, హార్డ్ డిస్క్‌లు, ట్యాబ్‌లో దాగి ఉన్న సమాచారాన్ని రాబట్టేందుకు ఎన్‌ఐఏ అధికారులు వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు

అమాయకులను వేధిస్తున్నారు..
ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ అమాయకులైన తమను వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఇద్దరు యువకులు ఎన్‌ఐఏ అధికారులపై ఆరోపణలు చేశారు.

మానవహక్కుల సంఘాన్ని కలిశారు..
హైదరాబాదులోని చాంద్రాయణ గుట్టకు చెందిన అద్నాన్ అహ్మద్ (24) అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, కరీంనగర్‌కు చెందిన బీటెక్ విద్యార్థి నోమాన్ జమాల్‌తోపాటు వారి కుటుంబసభ్యులు మంగళవారం మీడియా సమావేశంలో మానవహక్కుల సంఘాల నాయకులతో కలిసి మాట్లాడారు.

మాకు సంబంధాలు లేవు..
ఈ నెల 30న ఎన్‌ఐఏ అధికారులు తమను బేగంపేటలోని కార్యాలయానికి తీసుకువెళ్లారని, ఉగ్రవాద గ్రూపులతో సంబంధాల గురించి ప్రశ్నించగా తమకు ఎలాంటి సంబంధాలు లేవని చెప్పామని వారన్నారు. దీంతో ఈ కేసులో సాక్షులుగా మారాలని ఒత్తిడి తీసుకువస్తున్నారని, ఈ నెల 8న ఢిల్లీకి రావాలని చెప్పారని ఆరోపించారు.

కేసుల్లో ఇరికించే అవకాశం ఉంది..
ఢిల్లీకి తీసుకెల్లి తమను కేసుల్లో ఇరికించే అవకాశం ఉందని వారు ఆరోపించారు. 2014లో ఫేస్‌బుక్‌లో ఇరాక్‌లో ఏం జరుగుతున్నది? అనే అంశంపై పోస్టులను చూసినందుకు తమను అప్పట్లో ఎన్‌ఐఏ అధికారులు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారని వివరించారు.

కౌన్సెలింగ్ తీసుకున్నప్పటి నుంచి...
కౌన్సెలింగ్ తీసుకున్నప్పటి నుంచి పలుమార్లు పిలిపించి వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో సివిల్ లిబర్టీస్ మానిటరింగ్ కమిటీ ప్రతినిధి లతీఫ్‌ఖాన్, ఏపీసీఆర్ అధ్యక్షుడు జబ్బార్ సిద్దిఖీ, వైస్ ప్రెసిడెంట్ మహ్మద్ అబ్బాస్ ,డెమొక్రాటిక్ తెలంగాణ ఫ్రంట్ ఎంరాజు, పలువురు మానవహక్కుల సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు.
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications