షాక్: హైదరాబాద్ యువతిని పెళ్లాడాలనుకున్న ఐఎస్ ఉగ్రవాదులు

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: నగరానికి చెందిన ఓ యువతితో సిరియాకు చెందిన ఇస్లామిక్(ఐస్) ఉగ్రవాద నేతలు సంప్రదింపులు జరిపినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) పేర్కొంది. డిసెంబర్ 2015లో ఎన్‌ఐఏ అరెస్టు చేసిన తొమ్మిది మందిలో ఒకరి సోదరిగా ఈ యువతిని గుర్తించారు.

హైదరాబాద్‌లో పేలుళ్ల కుట్ర: ప్రధాన సూత్రధారి ఇంగ్లీష్ టీచర్‌!(పిక్చర్స్)

సిరియాకు చెందిన ఐసిస్ అగ్రనేత అబు జకారియా జిహాదీ మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌ను నడుపుతున్నాడు. దీని ద్వారా హైదరాబాద్‌లో ఉన్న ఐఎస్ సానుభూతిపరులతో గ్రూప్ డిస్కషన్స్ చేసేవాడు.

ఈ క్రమంలో భాగంగానే సదరు యువతి సోదరుడితో పాటు ఆమెతో కూడా అతడు మాట్లాడుతుండేవాడు. మ్యాట్రిమోనీ ద్వారా ఐఎస్ ఐడియాలజీని వ్యాప్తి చేసేవాడు. అబు జకారియాతో పాటు మరో వ్యక్తి ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు.

ISIS terrorists wanted to marry hyderabad girl, claims NIA

కాగా, కేసు విచారణలో భాగంగా విషయం తెలిసిన ఎన్‌ఐఏ అధికారులు యువతిని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ అనంతరం విడిచిపెట్టారు. స్థానిక యువతులను పెళ్లి చేసుకోవడం ద్వారా ఇరుదేశాల మధ్య సులువుగా ప్రయాణించవచ్చనే ఉద్ధేశంతోనే ఉగ్రవాదులు ఇలా వల వేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇటీవల హైదరాబాద్ నగరంలో ఎన్ఐఏ అధికారులు తెలంగాణ పోలీసుల సాయంతో 11మంది ఐఎస్ సానుభూతిపరులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వీరిలో కొందర్ని విచారించి వదిలేసింది. కాగా, ఈ ఉగ్ర సానుభూతిపరులు నగరంలో భారీ పేలుళ్లకు కుట్ర పన్నినట్లు విచారణలో తేలింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In a first, the NIA chargesheet filed against Islamic State on Monday reveals that a Hyderabad-based girl, sister of one of arrested IS operatives was part of its Hyderabad module and was in touch with senior leaders based in Syria as well. In fact, two Syria based leaders even wanted to marry her.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి